శ్రీ‌వారి ఆల‌య‌ ప్రారంభోత్స‌వానికి రండీ..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేసిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అమరావతిలో నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. ఈ మేర‌కు ఆల‌య ప్రారంభోత్స‌వ‌ ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేశారు. అంత‌కుముందు టీటీడీ వేద పండితులు ముఖ్య‌మంత్రికి వేద ఆశీర్వ‌చ‌నం ఇచ్చి స్వామివారి ప్ర‌సాదాలు అంద‌జేశారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో పాటు జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు ఉన్నారు.

ఈనెల 4వ తేదీ నుంచి అమ‌రావ‌తిలో నూత‌నంగా నిర్మించిన శ్రీ‌వారి ఆల‌య విగ్రహ ప్రతిష్ఠ‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమ‌వుతాయి. 9వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top