శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: క‌లియుగ‌ ప్ర‌త్య‌క్ష దైవం, తిరుమ‌ల‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆహ్వానించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డిలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. అనంత‌రం శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్థ‌ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం అంద‌జేశారు. ఈనెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.

Back to Top