రేపు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

 సంస్మరణ దినోత్సవంలో పాల్గొన‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
 

విజ‌య‌వాడ‌: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రేపు (21.10.2022, శుక్రవారం) పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన‌నున్నారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం చేరుకోనున్న సీఎం, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత ప్రసంగం అనంతరం పోలీస్‌ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తారు.  

Back to Top