జ‌గ‌న‌న్న ..దేవుడులా ఆదుకున్నారు!

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ల‌బ్ధిదారుల కృత‌జ్ఞ‌త‌లు

చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్ పర్యటన 

భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించిన ముఖ్య‌మంత్రి

సహాయ పునరావాసంపై వైయ‌స్ జ‌గ‌న్ ఆరా

అడుగడుగా మీకు నేను అండగా ఉన్నానంటూ బాధితుల‌కు సీఎం భ‌రోసా

చిత్తూరు: వరదల కారణంగా నష్టపోయిన తమను, తమ కుటుంబాలను  దేవుడులా ఆదుకున్నారని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బాధితులు, లబ్ధిదారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు ఎస్టీ కాలనీ, ఏర్పేడు మండలం పాపానాయుడు పేటలో  సీఎం శ్రీ వైయస్‌.జగన్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు.  వరద ప్రభావాన్ని పరిశీలిస్తూనే... సహాయ పునరావాసం అందిందా ? కలెక్టర్ సహా అధికారులు మిమ్మల్ని పరామర్శించారా? అంటూ నేరుగా బాధిత ప్రజలను అడిగి తెలుసుకున్న సీఎ శ్రీ వైయస్‌.జగన్‌.
వెదుళ్ల చెరువులో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. బాధిత ప్రజల సమస్యలను సావధానంగా విన్న సీఎం
అడుగడుగా మీకు నేను అండగా ఉన్నానంటూ భరోసా కల్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

గుత్తి వారి పల్లి హైస్కూలు కు చెందిన విద్యార్థులు ముఖ్య మంత్రి గారి కాలి నొప్పి ఎలా ఉంది మామయ్య అని అడగగా... బాగుంది అని చెబుతూ మీరందరూ బాగా చదువుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.

తూకివాకం కు చెందిన ఊహ  కుమా ర్తెకు తాను  ఉపయో గించే పెన్నును బహు మతిగా ఇచ్చిన ముఖ్యమంత్రి

వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామానికి చెందిన తుపాకుల సుజాత ఫిర్యాదు మేరకు వరదయ్య పాలెం మండలం ఇందిరానగర్ వి ఆర్ ఓ కె. చలపతి ని వెంటనే  సస్పెండ్ చేయమని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసిన సీఎం

రేణిగుంట:
 ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మెహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రేణిగుంట మం డలం వెదుళ్ల చెరువు ఎస్ టి కాలనీ, ఏర్పేడు మండలం పాపానాయుడుపేటలో పర్యటించి, వరద ప్రభావాన్ని పరిశీలించారు. 
ఇందులో భాగంగా దారిపొడవునా ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. 

పర్యటనలో భాగంగా సీఎం ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. సహాయ పునరావాసంపై గ్రామస్తులను సీఎం ప్రశ్నించారు. 
ఈ సందర్భంగా సీఎంను కలిసిన మహిళలు తమకు వరద సాయం అందిందని.. ఇంటి మంజూరు పత్రం అందజేశారని... నిత్యావసర సరుకులు అందించారని... అధికారులు వరద అనంతరం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై దేశమ్మ , మునెమ్మ, అమ్ములు,గంగమ్మ, నాగమ్మ,మునిరత్న, జరతమ్మ, ఆదిలక్ష్మి, శివరంజని లబ్ధిదారులు సంతోషంతో  ముఖ్య మంత్రికి వివరించారు.        

వరదల ధాటికి పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు... రూ. 2 వేలు ఆర్ధిక సాయం, నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారని తెలిపారు. 

కాలనీలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించిన సీఎం.... వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ఈ సందర్భంగా సీఎం వరదలో ముంపునకు గురైన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరికీ శాశ్వతంగా మంచి ఇళ్లు కట్టించి ఇస్తామని స్పష్టం చేసారు.

 
గుత్తి వారి పల్లి కి రోడ్డు లేదని.. 30 సంవత్సరాల క్రితం కట్టిన ఇండ్లుతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు తెలుపగా ఈ అంశాన్ని పరిశీలి స్తామని, వెంటనే రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపడతారని వారికి హామీ ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించి పనులు చేపట్టాలని అధికారులుకు ఆదేశాలు జారీచేశారు.

వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామానికి చెందిన  సుజాత  అనే మహిళ తన  భర్త పేరు మీద జీవనోపాధి కొరకు 2004 లో ప్రభుత్వం భూమి ఇవ్వడంతో పాటు డీ పట్టా జారీ చేసిందని, అప్పటినుండి  సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తన భర్త చనిపోయిన తర్వాత రైతు భరోసా కోసం ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకం కోసం ధరఖాస్తు చేయగా... తమకు న్యాయం చేయడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె సమస్యను వెంటనే పరిష్కారించాలని ఆదేశించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వరదయ్య పాలెం మండలం ఇందిరానగర్‌ వీఆర్వోను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసారు. 

వైద్య ఆరోగ్యశాఖలో మిడ్ లైఫ్ హెల్త్ ప్రొవైడర్స్ లకు నిర్వహించే కౌన్సె లింగ్ ను జిల్లా యూనిట్ గా తీసుకొని నిర్వహించాలని ఉద్యోగు లు అభ్యర్థించగా.. జిల్లాను యూనిట్ గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించేలా చర్యలు చేపడతా మని తెలిపారు.

ఆనంతరం ఏర్పేడు మండలం పాపానాయుడు పేట చేరుకున్న సీఎం స్వర్ణముఖి నదిపై వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. వరదలో ముంపునకు గురైన పొలాలను కూడా సీఎం పరిశీలించారు.

 ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రహదారులు  భవనాలు, జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. జరిగన నష్టంతో పాటు తక్షణమే తీసుకున్న సహాయ పునరావాసంపై అధికారులు సీఎంకు వివరాలందించారు.

  
  కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణ స్వామి. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి  మేక పాటి  గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్ది రెడ్డి వెంకట మిధున్ రెడ్డి, డాక్టర్ పి.గురు మూర్తి, ఎం ఎల్ సి భరత్, చంద్రగిరి శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ డా.చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top