తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం భేటీ అయ్యింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సీఈఓ, సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్‌కరన్ బృందం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ జి.శేఖర్ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా.. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, అలాంటి రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్‌ను పొందుపరచాలని సీఎం వైయస్ జగన్ కోరారు. ఈ మోడల్‌ను ఖరారుచేయగానే రాష్ట్రంలో కూడా అమలుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సీఎం తెలిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ మార్గదర్శకంగా నిలిచింది.. – అంతకుముందు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ను సందర్శించిన కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం. – తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్న బృందం. – వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం కోసం వైయస్.జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించిన కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా. – ఆర్బీకేల వ్యవస్థను కొనియాడిన అహూజా. – అగ్రిల్యాబ్స్ ఏర్పాటు రైతులకు ఎంతో ప్రయోజనకరం. – అగ్రిల్యాబ్స్‌లో ముందస్తుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విత్తనాలు, ఎరువుల్లో కల్తీ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా ఇవ్వాలన్న అహూజా. – దేశంలో ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను, రైతులను హెచ్చరించడానికి, తద్వారా కల్తీల బారినుంచి రైతులను కాపాడేందుకు అవకాశం ఉంటుందన్న అహూజా. – పొలంబడి పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులనూ ప్రశంసించిన కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి. – అనేక రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ వినియోగించుకుంటున్న తీరు అమోఘమన్న అహూజా. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా ముందడుగులో ఉందన్న కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి అహూజా. – ఇ– క్రాపింగ్ ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని, తద్వారా టెక్నాలజీని మిళితం చేసి రైతులకు చక్కటి ప్రయోజనాలు అందిస్తున్నారన్న అహూజా. – ఫాంగేట్ వద్దే కొనుగోళ్లు, ఆర్బీకేల స్థాయిలోనే పంటల విక్రయం తదితర అంశాలను ప్రశంసించిన అహూజా. – కౌలు రైతులకు సీసీఆర్సీకార్డుల మీద కూడా ప్రశంసలు. – ఇది దేశ వ్యాప్తంగా అమలుకు చక్కటి విధానమన్న అహూజా. – ఆర్బీకేల స్థాయిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటు కూడా చాలా చక్కటి విధానమన్న అహూజా. – సామాజిక తనిఖీలకోసం జాబితాలు ఆర్బీకేల్లో ప్రదర్శించడం కూడా చాలా బాగుందని సీఎంకు చెప్పిన అహూజా. – రైతులతో తాను మాట్లాడుతున్నప్పుడు విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పులను తమతో పంచుకున్నారన్న అహూజా. – విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించిన కేంద్ర బృందం. – రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ధరల స్థిరీకరణనిధి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లిన సీఎం