టీడీపీ నుంచి 20 మంది మ‌హిళ‌లు వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరిక‌

 కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన విశ్వేశ్వరరెడ్డి 

అనంత‌పురం: ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు మండలం గడేహోతురులో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.టీడీపి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ లోకి 20 మంది మహిళలు చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి వారికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. సర్పంచ్ సురేంద్ర, పార్వతి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బంగి వెంకటలక్ష్మి, పొలికి వన్నూరమ్మా,మూసి మారెక్క, జెన్నే సోమక్క, ఏ. ఆనందమ్మతో పాటు మరో 15 మంది పార్టీ లో చేరిన వారిలో ఉన్నారు.ఇప్పటికే ఆ గ్రామ సర్పంచ్ చేరికతో బలహీనపడిన టీడీపీ మరో 20 మంది మహిళలు చేరడంతో మరింత బలహీన పడినట్లయింది.వజ్రకరూరులో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రెడ్డి, ధర్మపురి సర్పంచ్ సోమసేకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ,నాయకులు ముండస్ ఓబులేసు, రాకెట్ల బాబు, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top