టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన పది టిడిపి కుటుంబాలు చేరిక..!

  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి 

అనంత‌పురం:  రాప్తాడునియోజకవర్గం కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి గ్రామానికి టిడిపి కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  అనంతపురంలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో మాజీ వార్డు మెంబర్ బాషా ఆధ్వర్యంలో కత్తె నారాయణ స్వామి, కత్తే పెద్దన్న, శ్రీ‌రాములు, రెడ్డప్ప ఆచారి, ఆంజనేయులు, సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణ, ఆదిశేషు తదితరులు చేరారు. 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము టిడిపి నుంచి వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top