నంద్యాల: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడికి యత్నించారు. టీడీపీ శ్రేణులు స్క్రూటినీ జరుగుతున్న కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. ఎంపీ శబరి హంగామా మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చిన నంద్యాల ఎంపీ శబరి, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హంగామా సృష్టించినట్లు వైయస్ఆర్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై కూడా టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. నామినేషన్ల పరిశీలన కేంద్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు అండగా నిలిచిన న్యాయవాది ఫణీంద్ర శర్మపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. నామినేషన్ల పరిశీలనను ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని, అభ్యర్థుల పత్రాలకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.