వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన నెల్లూరు సిటీ, రూరల్ టీడీపీ కార్పొరేటర్లు

వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఐదుగురు కార్పొరేట‌ర్లు

తాడేప‌ల్లి:  నెల్లూరు న‌గ‌రంలో కూట‌మి ప్ర‌భుత్వానికి భారీ షాక్ త‌గిలింది. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో  నెల్లూరు సిటీ, రూర‌ల్ టీడీపీ కార్పొరేట‌ర్లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఇవాళ తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్‌ కార్పొరేటర్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్‌ కార్పొరేటర్), షేక్‌ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్‌ కార్పొరేటర్‌) వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  కార్యక్రమంలో  మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top