తిరువూరులో టీడీపీ అరాచకం 

వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల‌ర్లు వెళ్ల‌కుండా అడ్డ‌గింత‌

కార్ల‌పై ప‌చ్చ గూండాల దాడి

ఎన్టీఆర్ జిల్లా:  తిరువూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక‌ల వేళ మ‌రోసారి టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైయ‌స్ఆర్‌సీపీ  కౌన్సిలర్లు,  నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైయ‌స్ఆర్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వాహనాలపై టీడీపీ గుండాల దాడి
వైయ‌స్ఆర్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. ఏ.కొండూరు మండలం రేపూడి క్రాస్ రోడ్డు వద్ద పార్టీ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ మొండితోక‌ అరుణ్ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్‌ వాహనాలను టీడీపీ శ్రేణులుఅడ్డగించారు. వాహనాలు కదలకుండా ప‌చ్చ పార్టీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, అరుణ్ కుమార్ ఉన్న కారు అద్దాలు, మిర్రర్ లు పగులగొట్టారు. అరుణ్‌కుమార్‌, స్వామిదాస్‌పై 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేయించారు. 

పోలీసుల వితండ‌వాదం
నిన్న టీడీపీ గూండాల దాడితో  వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు కోరారు. తిరువూరు వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు. తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. 

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌దే తుది నిర్ణ‌యం
తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి వాయిదా వేశారు. ఇవాళ కూడా కోరం లేని కార‌ణంగా తిరువూరు మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు నివేదిక ఇస్తున్న‌ట్లు ఎన్నిక‌ల అధికారి మాధురి ప్ర‌క‌టించారు.

Tdp Conspiracy Politics In Tiruvuru Municipal Chairman Elections

Back to Top