పులివెందులలో రాత్రంతా హైడ్రామా 

వైయ‌స్ఆర్‌ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైయ‌స్ఆర్‌ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైయ‌స్ఆర్ సీపీ నేతలను అరెస్ట్‌ చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. 

నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి  బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్‌ సహా పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. 

‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయం దారుణం. వైయ‌స్ఆర్‌ర్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.

Back to Top