శ్రీసత్యసాయి జిల్లా: మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం వైయస్.జగన్ సమక్షంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నేత వేణుగోపాల్(డీయస్పీ), జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర, పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ టిెక్కెట్ హామీతో డీఎస్పీ ఉద్యోగానికి వేణుగోపాల్ రాజీనామా చేశారు. తీరా చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వేణుగోపాల్ మోసానికి గురైయ్యారు.