మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి  సాధ్యం

మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌

రామచంద్రపురం 11వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ ‘గడపగడపకు వైయ‌స్‌ఆర్‌’

ప్రజల సమస్యలు తెలుసుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌, పిల్లి సూర్యప్రకాష్ 

రామ‌చంద్రాపురం:  రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపుతోనే వార్డుల సమగ్ర అభివృద్ధి సాధ్యమని మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ అన్నారు. రామచంద్రపురం టౌన్‌ 11వ వార్డులో ‘గడపగడపకు వైయ‌స్‌ఆర్‌’ కార్యక్రమంలో భాగంగా కేతా వారి వీధి, తోటవారి వీధి వెనుక లేఅవుట్‌ ప్రాంతాల్లో ఆయన, వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాష్‌ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. 

Back to Top