తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయమని వైయస్ జగన్ తెలిపారు. గిడుగు జయంతిని పురస్కరించుకుని నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.