వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ, జ‌న‌సేన నేత‌లు

కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నాయ‌కులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా జనసేన మాజీ అధ్యక్షుడు మాదా రాధాకృష్ణమూర్తి, గుంటూరు జిల్లా టీడీపీ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ సుభాని, మాజీ ఎంపీపీ కొండా శివనాగిరెడ్డి, పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.షాలినీ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు.. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top