వైయస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు వైయస్‌ఆర్‌సీపీ సేవాదళ్‌ టీమ్‌ 

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తమిళనాడు ౖవైయస్‌ఆర్‌సీపీ  సేవాదళ్‌ టీమ్‌ సభ్యులు కలిశారు.  ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమిళనాడు, చెన్నైలో స్ధిరపడిన ఏపీ వాసులనుంచి 14 వేల సంతకాలు సేకరించి తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సేవాదళ్‌ సభ్యులను వైయస్‌ జగన్‌ అభినందించారు. వైయస్‌ జగన్‌ ను కలిసిన వారిలో ౖవైయస్‌ఆర్‌సీపీ తమిళనాడు సేవాదల్‌  స్టేట్‌ ప్రెసిడెంట్‌ హుస్సేన్, తమిళనాడు అధికార ప్రతినిధి కృతి త మిళనాడు పార్టీ నాయకులు దాసరి శరత్‌ కుమార్, సంపత్, మణివణ్ణన్, ప్రకాష్‌ ఉన్నారు.
 

Back to Top