ఈవీఎంల భద్రతపై అనుమానాలు

సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాలి

వైయస్‌ఆర్‌సీపీ వేమూరు అభ్యర్థి మేరుగ నాగార్జున

గుంటూరు: వేమూరు నియోజకవర్గానికి సంబంధించి నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద అర్ధరాత్రి సమయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. యూనివర్శిటీకి చేరుకున్న ఆయన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ  కెమెరాలను పరిశీలించారు.రాత్రి సమయంలో మూడు గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయలేదని దీనికి వెనుక అంతర్యం ఏమిటో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Back to Top