తాడేపల్లి: టీడీపీ నేత నారా లోకేష్ నెల్లూరు ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు, కానీ ఇవాళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారనడంతో వర్షాలు కురుస్తున్నాయని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఓఎన్‌జీసీ సంస్ధ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ విడుదల చేశారు.ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్‌లో ఎమ్మెల్యే, లబ్ధిదారులు మాట్లాడారు కిలివేటి సంజీవయ్య ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం, ఇది ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్ధాల నాటి కల, పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం పునరుద్ధరించాలని కోరుతున్నా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు, మీ దయతో అది జరుగుతుంది, వర్షం వల్ల ఈ కార్యక్రమం ఆగింది, లోకేష్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి వర్షాలు లేవు, కానీ మీరు వస్తున్నారనడంతో వర్షాలు కురుస్తున్నాయి, రైతులు సంతోషంగా ఉన్నారు, ధన్యవాదాలు. భైరవస్వామి, లబ్ధిదారుడు, మట్లపాలెం, తాళ్ళరేవు మండలం, ముమ్మిడివరం, కాకినాడ కలెక్టరేట్ నుంచి అందరికీ నమస్కారం, అన్నా మా మత్స్యకార కుటుంబాల నుంచి మీకు శుభాకాంక్షలు, మాకు ఈ రోజు పండుగ రోజు, మాకు నేరుగా అకౌంట్లో వేస్తున్నారు, మాకు డీజిల్ సబ్సిడీ కూడా వస్తుంది, ప్రమాద బీమా కూడా వస్తుంది, ఈ పథకాలు అన్నీ మాకు అందుతున్నాయి, మా గుండెల్లో మీరు ఉంటారు, మేం గతంలో ఇలా లబ్ధిపొందలేదు, మాకు గతంలో పరిహారం తక్కువగా ఇచ్చారు, మీరు దేవుడిలా మా కుటుంబాల్లో వెలుగులు నింపారు, మేం రూ. 11500 వస్తాయా రావా అనుకున్నాం కానీ అన్ని విడతల్లో అన్నీ అందుతున్నాయి, మేమంతా సంబరాలు చేసుకుంటున్నాం, మీరు అన్నలా ముందుండి సాయం అందేలా చేస్తున్నారు, మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టుకుంటున్నాం, మా జీవితాల్లో వెలుగులు వచ్చాయి, మా పిల్లలను కూడా చదివిస్తున్నాం, వారికి అన్నీ అందుతున్నాయి, మా అమ్మకు, మా కుటుంబానికి అన్నీ అందుతున్నాయి, 2024లో మీరే సీఎంకావాలి, మీ వెంటే మేం ఉంటాం. పల్లెపు రాంబాబు, ముమ్మిడివరం మండలం, లబ్ధిదారుడు, కోనసీమ కలెక్టరేట్ నుంచి జగనన్నా నమస్తే, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, మమ్మల్ని గుర్తించింది మీరే అన్నా, గతంలో మత్స్యకారులు ఎక్కడున్నారో తెలిసేది కాదు, నాన్నగారి హయాంలో మాకు లబ్ధి జరిగింది, తర్వాత మమ్మల్ని ఆదుకోలేదు, మీరు పాదయాత్రలో మాట ఇచ్చారు, సీఎం అవగానే మాట నిలబెట్టుకున్నారు, మీరు మాకు మంచి పరిహారం ఇస్తున్నారు, మీకు రుణపడి ఉంటామన్నా, వేట నిషేద సమయంలో ఆర్ధిక సాయం చేస్తున్నారు, డీజిల్ మీద సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా ఇలా చాలా సాయం చేస్తున్నారు, మాకు తెలియని పధకాలు కూడా పెట్టి మమ్మల్ని ఆదుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది.