తాడేపల్లి: మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అణగారిన వర్గాల వేదనను అక్షర రూపంలో జ్వాలగా మలిచి విప్లవానికి నాంది పలికిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) గారు. ``నేను సైతం.. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను`` అంటూ సామాన్యుల్లోనూ అభ్యుదయ భావాన్ని నింపిన అక్షర శిల్పి శ్రీశ్రీ.. నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని ‘మహాప్రస్థానం’తో తట్టి లేపి, చైతన్యాన్ని తీసుకువచ్చిన ప్రజాకవి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ట్వీట్ చేశారు.