వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడికి విడదల రజిని ప‌రామ‌ర్శ‌

ప‌ల్నాడు జిల్లా: చిలకలూరిపేట పట్టణానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ బషీర్ మేస్త్రి ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బషీర్ మేస్త్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఇలాంటి నాయకులు త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఎప్పుడూ తమ అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

Back to Top