గోదావరి డెల్టాకు జీవం పోసిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్

 జయంతి సందర్భంగా నివాళులర్పించిన చిర్ల జగ్గిరెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రావులపాలెంలోని వైయ‌స్ఆర్‌సీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, రైతాంగ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేసిన మహనీయుడు కాటన్ అని పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి కారణంగానే గోదావరి డెల్టా ప్రాంతం నేడు సస్యశ్యామలంగా మారిందని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top