కర్నూలు: నవరత్నాల లక్ష్మీ నరసింహ స్వామి ఈరన్న స్వామి జాతర మహోత్సవం కోడుమూరు నియోజకవర్గంలో ఘనంగా కొనసాగుతోంది. జాతర సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాల్లో వైయస్ఆర్‌సీపీ ఎస్ఈసీ సభ్యుడు, మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజారులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, నేతలు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. జాతర వేడుకలు భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. బ్యాట్ పట్టి.. బౌలింగ్ వేసి ఉత్సాహం నింపిన నేతలు జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సతీష్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బ్యాట్ పట్టి, బౌలింగ్ వేస్తూ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని, క్రీడలు ఆరోగ్యానికి, క్రమశిక్షణకు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.