తాడేపల్లి: బాలకృష్ణ, చంద్రబాబును మించిన సైకోలెవరు బ్రాహ్మణి.. అంటూ రాష్ట్ర పర్యాటక,యువజన,సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ఊదరగొట్టుకుంటూ, పచ్చఛానెళ్లల్లో పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు పేదల కోసం.. ఒక్క మంచి ఆలోచన అయినా చేశాడా..? అని ప్రశ్నించారు. అదే మా నాయకుడు జగనన్న అతిచిన్న వయసులోనే పోరాడే యోధుడిగా నిలిచి, రాష్ట్రంలో 151 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అంత చిన్నవయసులోనే ప్రజలకు ఏం కావాలో .. వారికి ఏ ఇవ్వాల్నో ఆలోచించి వారి సంక్షేమానికి, వారి ఆరోగ్యం కోసం జగనన్న సురక్ష పేరిట ప్రతి ఇంటి గడప దగ్గరకే వైద్యాన్ని తెచ్చిన మహనీయుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవమున్న నేతగా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపెడతామంటూ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడి, షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు ప్రజాధనం స్వాహా చేశాడు. – ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చొంటే, ఈరోజు ఆయన భార్య,కోడలు బ్రాహ్మణి సిగ్గులేకుండా.. ప్రజలంతా గంటకొట్టి తమకు సంఘీభావం తెలపండని కోరతారా..? – బ్రాహ్మణికి బహుశా అసలు సైకోలు ఎవరో తెలియక ట్వీట్లు పెడుతున్నారనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద సైకోలెవరంటే, ఒకరు మీ నాన్న బాలకృష్ణ కాగా మరొకరు మీ మామ చంద్రబాబు అని ఆమెకు గుర్తుచేస్తున్నాను. – మీ నాన్న, మీ మామకు అడ్రస్ కల్పించి, సమాజంలో గౌరవాన్ని అందించిన మీ తాత ఎన్టీ రామారావు గారిపై చెప్పులేసి.. ఆయన్ను వెన్నుపోటు పొడిచి .. ఆయన పార్టీని లాక్కుని చివరికి ఆయన చావుకు కారణమైన పెద్దసైకోలెవరంటే.. అది బాలకృష్ణ, చంద్రబాబు అని చిన్నపిల్లలను అడిగినా చెబుతారు. – తప్పుచేసి, సాక్ష్యాధారాలతో సహా దొరికి జైలుకి పోయిన తర్వాత కూడా చంద్రబాబు కుటుంబం ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటం చాలా సిగ్గుచేటు. – మరోసారి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ట్వీట్‌లు పెట్టినా నారా బ్రాహ్మణికి మర్యాద దక్కదని హెచ్చరిస్తున్నాను. – మీరు ఇలాగే నీచమైన మాటలతో ప్రజల్ని అమాయకుల్ని చేయాలనుకుంటే మిమ్మల్ని హైదరాబాద్‌కే పరిమితం చేసేలా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు తరిమికొట్టి తగిన బుద్ధిచెబుతారు.