రాజకీయ శుంఠ పవన్ కల్యాణ్

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్  

 లోకేష్ రాజకీయాలకు పనికి రాడు.. పేరంటానికే పనికి వస్తాడు..

  ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు - సీట్లు లేని పార్టీ బీజేపీ..

తాడేప‌ల్లి: రాజకీయ శుంఠ పవన్ కల్యాణ్ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు, బీజేపీ నాయకులకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై విమర్శలు చేసే అర్హత లేదు. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే బాగుండేది.. స్టీల్ ప్లాంట్ ఎంతకు అమ్మతున్నారు, దానిలో మీ కమిషన్ ఎంతో చెబితే బాగుండేది. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేక పోతున్నారు.. పోలవరానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదు, విభజన హామీలు ఎప్పుడు నెరవేర్చుతారో చెప్పాలి. విభజన హామీలు గురించి మాట్లాడకుండా.. మా ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు వారికి లేదు. బీజేపీ నేతల విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాము..

 టీడీపీ కార్యాలయంలో తయారైన స్క్రిప్ట్ ను సుజనా చౌదరి తీసుకువస్తే.. దాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు.   టీడీపీ మాటలనే ఠాకూర్  మాట్లాడారు. సీఎం జగన్ పాలన గురించి నేరుగా ప్రజలను అడిగితే మీకు సరైన సమాధానం వచ్చేది.
- ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు - సీట్లు లేని పార్టీ బీజేపీ.. అటువంటి పార్టీనా మాపై విమర్శలు చేసేది..?

  సంక్షేమ పథకాల ద్వారా గడిచిన మూడేళ్ళలో.. ఒక లక్షా 65 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలు ఖాతాల్లో వేసిన సీఎం వైయ‌స్ జగన్‌. వైయ‌స్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది.  బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా..?

 బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు.. బీజేపీ టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివే సితికి దిగజారిపోయింది.. వైయ‌స్ జ‌గ‌న్‌ గారు అమలు చేస్తున్న సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలనే.. బీజేపీ పాలిత రాష్ట్రాల అధికారులు, మంత్రులు కూడా వచ్చి ప్రశంసించింది మీకు కనిపించలేదా..?

 పవన్ కళ్యాణ్ కాళీ సమయాల్లో.. కార్టూన్ సినిమాలు బాగా చూస్తున్నట్టున్నారు.. అందుకే, కార్టూన్ సినిమాల్లో విలన్ పేర్లు చూసి అందరికీ పెడుతున్నాడు.. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక శుంఠ. 
- పవన్ కల్యాణ్ కు సినిమాలపై ఉన్న అవగాహన రాజకీయాలపై లేదు..

 పవన్ కళ్యాణ్ ఎవరితో పోటీ చేస్తే మాకేంటి.. పోటీ చేసిన రెండుచోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తో మాకు పొత్తు ఏమిటి..?

 చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టమన్నారా..?
- చిరంజీవి గారు వస్తే.. జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు, ఎంత బాగా గౌరవించారో చిరంజీవే స్వయంగా చెప్పారు..

  పవన్ కల్యాణ్ ఓడిపోయిన భీమవరంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సోదర భావంతో ఆలింగనం చేసుకోవడాన్ని పవన్ జీర్ణించుకోలేక పోతున్నారు..

 తనకు జీవితం - జీవనం చిరంజీవినే అన్న సంగతి పవన్ గుర్తు పెట్టుకోవాలి.. కాపులు నాకు ఓట్లు వేయలేదని పవన్ చెప్పారు.. కాపులు ఓట్లు వేస్తే 40 సీట్లు వచ్చేవని పవన్ అన్నారు. పవన్ కు ధైర్యం ఉంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీలకు పోటీ చేస్తానని చెప్పాలి..

  పెళ్లిళ్లు,  పేరంటాలకు వచ్చి లోకేష్ రాజకీయాలు చేయడం అవసరమా..? జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంటో, లోకేష్ మగతనం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. పేరంటానికి వచ్చినప్పుడు, తాంబూలం, జాకెట్ ముక్కలు ఇస్తే.. తీసుకొని వెళ్ళిపోవాలే తప్ప లోకేష్ కు రాజకీచయ విమర్శలు ఎందుకు..  లోకేష్ రాజకీయాలకు పనికి రాడు.. పేరంటానికే పనికి వస్తాడు..

Back to Top