తాడేపల్లి: ఎర్రగొండపాలెంలో దళితుల మీద దాడులు చేయించి.. దళితులే తనపై దాడులు చేశారంటూ చంద్రబాబు అండ్ కో ఎదురు దాడి చేస్తుందని, ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు రాయించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సోషల్ జస్టిస్) జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. దళిత నియోజకవర్గం మీద రాక్షసుడిలా చంద్రబాబు తన గ్యాంగ్ తో పడ్డాడని, దళితులంటే ఏరోజూ చంద్రబాబుకు పడదు. దళిత వ్యతిరేకిగా చంద్రబాబు ముద్ర వేసుకున్న అంశాలు కారంచేడు ఘటనల నుంచి కనిపిస్తాయన్నారు. బాబు వర్గం అంతా కారంచేడులో ఊచ కోత కోసిన విధానాన్ని దళితులు ఎప్పటికీ మరవరన్నారు. మనిషి రూపంలో ఉన్న సైతాన్ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు చేసిన దాష్టీకాన్నిజూపూడి ప్రభాకర్‌రావు తీవ్రంగా ఖండించారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జూపూడి ప్రభాకర్‌రావు ఇంకా ఏం మాట్లాడారంటే..
చంద్రబాబు కొడుకు దళితులు ఏం పీకుతారు అంటూ దళితులను అవమానించింది నిజం కాదా..? మీరు ఎందుకు ఖండించలేదంటే.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని మాట్లాడిన నోరు బాబుది. మీ ఇద్దరి డీఎన్ ఏ ఒకటే కదా.. దళిత వ్యతిరేక డీఎన్ఏనే. మీ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేస్తే.. మీ నాలుకలను కంట్రోల్ లో పెట్టుకోమని అడిగితే.. దళితులకు క్షమాపణ చెప్పమని అడిగితే రాళ్ళు వేయిస్తారా.. దాడులు చేయిస్తారా.. దళిత మంత్రిగా నిరసన తెలియజేయటం.. తప్పా.. ప్రతిపక్ష నాయకుడిగా నీవు దళితులను బూతులు మాట్లాడుతుంటే.. నోటికొచ్చినట్లు హేళనగా మాట్లాడుతుంటే.. మేము పడాలా.. దళిత జాతి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు.
సైతాన్ బాబు..
చంద్రబాబు నాయుడు మనిషి రూపంలో ఉన్న సైతాన్.. ముసలోడు అయినా, అన్నీ దగ్గర పడుతున్నా దళితుల పట్ల సరైన దృక్పథం, ఆలోచన ఆయనకు రాలేదు. దళితుల్ని, కులాల్ని, ఆఖరికి కుటుంబాలను కూడా విడదీసే దుర్మార్గుడు చంద్రబాబు. అమరావతి రాజధానిలో ఇళ్ళ స్థలాలను దళితులకు, పేదలకు కట్టబెడుతుంటే.. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని అడ్డుకున్నది చంద్రబాబు కాదా.. అలాంటి రాజధాని మాకు ఎందుకు? చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు.. దళిత వ్యతిరేక చర్యలు.. ప్రతి చర్యలోనూ కనిపిస్తాయి. చంద్రబాబుతో పాటు, ఆయన కొడుకు ఇంకా చెలరేగిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను చంద్రబాబు రెచ్చగొడుతున్న మాటలు, వీడియోలను రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇదా 40 ఏళ్ళ ఇండస్ట్రీ.. ?. దెయ్యం రూపంలో ఉన్న నరరూపరాక్షసుడిలా, సైతాన్ లా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది నీవు కాదా బాబూ..?
బాబు ఎక్కడికి వెళ్ళినా నిరసనలు తెలియజేస్తాం..
దళితులకు క్షమాపణలు చెప్పే వరకు.. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా.. మా దళితులంతా నిరసనలు తెలియజేస్తారు.. నిన్ను తిరగనివ్వం.. నువ్వు ఎక్కడ అడుగు పెడితే.. అక్కడ మా దళితులు అంతా నిరసన వ్యక్తం చేస్తారు, మిమ్మల్ని అడ్డుకుంటారు. దళితులపట్ల నీచమైన మీ వైఖరిని ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలుకుతున్నాం. నీకున్న ఎల్లో మీడియా ద్వారా.. ప్రతి అంశాన్నీ అబద్ధాలతో ప్రచారం చేస్తావా..?. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు డీబీటీ ద్వారా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా 46 నెలల్లోనే ఏకంగా రూ. 2.8 లక్షల కోట్లు ఇస్తే.. దాన్నీ బొక్కుడు అని తప్పుబడతారా..?. చంద్రబాబుకు ఎంతసేపటికీ బొక్కుడు తెలుసుగానీ.. ఇవ్వడం తెలియదు. అందుకే అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అంటేనే పేదలకు వ్యతిరేకం. దళితులకు వ్యతిరేకం. అటువంటి చంద్రబాబు దళితుల హక్కులను కాలరాస్తున్నాడు, దాడులు చేయిస్తున్నాడు. నేషనల్ సెక్యూరిటీ పెట్టుకున్నంత మాత్రాన.. నీ పతనాన్ని, నీ ఓటమిని ఏమైనా ఆపగలరా..? రాళ్ళు వేసింది వారు, కవ్వించింది వారు. తనకు ప్రత్యేక సెక్యూరిటీ ఉందని ఉసిగొల్పుపుతారా.. రేపు ఎన్నికల్లో చంద్రబాబు సెక్యూరిటీ వచ్చి ఓట్లు వేస్తారా..? మంత్రిని కూడా నెట్టేసి, మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే.. మంత్రి షర్టు విప్పి నిరసన వ్యక్తం చేస్తే తప్పా.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఫ్యాంటు, చొక్కా విప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
టీడీపీని పాతాళానికి తొక్కేస్తారు..
వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ.. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే చంద్రబాబుకు కడుపు మంటలా ఉంది. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టినా.. ప్రతి దాన్ని వ్యతిరేకించిందీ, అడ్డుకున్నది చంద్రబాబే. ఎందుకంటే.. వీటివల్ల అణగారినవర్గాలు ఎక్కడ బలపడతాయన్నదే చంద్రబాబు భయం. ఇప్పటికే పతనంలో ఉన్న మిమ్మల్ని, మీ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో పాతాళానికి ప్రజలు తొక్కేస్తారు.. మీ పార్టీలో కొంతమంది దళితులను మీ చుట్టూ పేటిఎం బ్యాచ్ గా పెట్టుకుని.. మమ్మల్ని తిట్టిస్తావా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక సమానత్వం వైపు మా వర్గాలన్నీ ముందుకు వెళుతున్నాయి. సీఎం వైయస్ జగన్‌కి అండగా ఉండటం కోసం.. మేం నిలబడతాం. నువ్వు ఏరోజు అయినా డిప్యూటీ సీఎంలుగా దళితులను చేశావా.. ఏరోజైనా దళితులను ఎదగనిచ్చావా.. నీ ప్రాపకం కోసం పదవులు ఇచ్చినట్టే ఇచ్చి, మళ్ళీ వారిని హెలికాఫ్టర్లతో కూల్చి వేయలేదా..?
2024లోనూ బాబుకు నో ఎంట్రీ..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పేరుతో, ఆ ఇంట్లో చొరబడి చిచ్చు పెడుతున్నది నువ్వు. నీ ఎల్లో మీడియా కాదా చంద్రబాబూ..? రోజూ మీ ఎల్లో మీడియాలో విషం చల్లిస్తున్నది నువ్వు కాదా..? నీ గుణం, నీ సంస్కృతి, పేదల పట్ల నీకు ఉన్న దుర్మార్గమైన ఆలోచన విధానం.. ఇవన్నీ సైతాన్ లక్షణాలే.. అందుకే మనిషి రూపంలో ఉన్న సైతాన్ చంద్రబాబు. 2024లో కూడా రాష్ట్రవ్యాప్తంగా, దళిత నియోజకవర్గాల్లోనూ నీకు నో ఎంట్రీ.. బోర్డులు పెడతారు.. నువ్వు, నీ పార్టీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు.