శ్రీ సత్యసాయి జిల్లా ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా, క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన‌ చికిత్సకు ఆదేశం
 

 అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైయ‌స్ జగన్‌.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top