సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన సోమేశ్‌ కుమార్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురువారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్ వైయ‌స్ జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.  రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొన‌డంతో ఆయ‌న ఏపీలో రిపోర్ట్ చేసేందుకు వ‌చ్చారు.  ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేష్‌ కుమార్‌.. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. ఈ సంద‌ర్భంగా సోమేశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయడానికి వచ్చాను. వీఆర్‌ఎస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు.  

Back to Top