లోకేష్‌..నోరు అదుపులో పెట్టుకో ఖ‌బ‌ర్దార్‌!

సోష‌ల్ వెల్పెర్ బోర్డు చైర్మ‌న్‌ పులి సునీల్ కుమార్

తాడేప‌ల్లి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని సోష‌ల్ వెల్ఫేర్ బోర్డు చైర్మ‌న్ పులి సునీల్ కుమార్ పేర్కొన్నారు. లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకో..ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊర్కోబోమ‌ని.. ఖబర్దార్ అంటూ హెచ్చ‌రించారు. బుధ‌వారం వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సునీల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.  గుంటూరులో దళిత యువతి రమ్య హత్య బాధాక‌ర‌మ‌న్నారు. ఈ విష‌యం తెలియగానే, సీఎంగారు వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని, నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని అధికారుల‌ను ఆదేశించారు. ర‌మ్య‌ కుటుంబానికి బాసటగా నిలుస్తూ ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేసింద‌న్నారు.  ఆస్పత్రిలో శవ పంచనామా కూడా దగ్గరుండి చేయించి, మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే, దాన్ని తరలించకుండా టీడీపీ నేత‌లు అడ్డుకోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. లోకేష్‌ కోసం రమ్య మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరలించకుండా ఆపార‌ని,  అక్కడ కూడా రాజకీయం చేస్తూ, పార్టీ జెండాలు కట్టార‌ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  రమ్య హత్య తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుణ్ని అరెస్టు చేశార‌ని తెలిపారు. టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో ద‌ళితులు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండేది కాద‌న్నారు. సాక్ష్యాత్తు అప్ప‌టి దెంద‌లూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌హిళా త‌హ‌శీల్దార్‌ను జుట్టుప‌ట్టుకుని ఈడ్చుకెళ్లార‌ని, ఆ ఘ‌ట‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పంచాయితీ చేశార‌ని తెలిపారు.  ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ద‌ళితుల‌ను హేళ‌న‌గా మాట్లాడార‌ని, ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రు కోరుకుంటార‌ని ఆ నాడు దూషిస్తే..టీడీపీలోని ద‌ళిత నేత‌లు ఏం చేశార‌ని నిల‌దీశారు. ఇవాళ ద‌ళితుల‌ను అడ్డుపెట్టుకొని రాజ‌కీయాలు చేయ‌డం సిగ్గు చేటు అన్నారు.  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నా కొడుకులు అని లోకేష్ దూషించ‌డం దుర్మార్గ‌మ‌న్నారు. మాకు విచక్షణ ఉంది కాబట్టే, మేము నిన్ను ఏమీ చేయకుండా వదిలేశామ‌ని పేర్కొన్నారు.   

Back to Top