సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు శార‌దా పీఠం వార్షిక మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

తాడేప‌ల్లి: విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అంద‌జేశారు. ఆహ్వన పత్రికను అందజేసిన అనంతరం ముఖ్యమంత్రికి  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి  ప్రసాదాలు అందజేశారు. జనవరి 27, 2023 నుంచి జనవరి 31, 2023 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వివ‌రించారు.

Back to Top