వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌

తాడేప‌ల్లి:  సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఏ.ఎం.డీ ఇంతియాజ్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో ఏ.ఎండి. ఇంతియాజ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top