వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు

 వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఒంగోలు నేతలు

 వైయ‌స్ఆర్‌సీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైయస్‌ జగన్‌

 పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని వెల్లడి

తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బుధవారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ సీనియర్‌ నాయకుడు డి.సతీష్‌బాబు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన వైయస్‌ జగన్‌.. భవిష్యత్తులో పార్టీ కోసం సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

 వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్‌బాబు తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని వెల్లడించారు. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో టి.నాగలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
 

Back to Top