పులివెందులలో వైయ‌స్‌ జగన్‌ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు 

పులివెందుల: వైయ‌స్ఆర్‌ జిల్లా పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైయ‌స్‌ జగన్‌ ఇంటిని ఆదివారం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఇతర పోలీసు అధికారులతో కలసి సందర్శించారు. వైయ‌స్‌ జగన్‌ ఇంటివద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఎక్కడ అమర్చాలి, సందర్శకులను ఇంటి లోపలికి ఏవిధంగా పంపించాలి అనే అంశాలపై  చర్చించారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు.

ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్, అగ్నిమాపక అధికారులకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇంటలిజెన్స్‌ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, పులివెందుల డీఎస్పీ నాగరాజు, అర్బన్‌ సీఐ రామాంజి నాయక్, రూరల్‌ సీఐ రామకృష్ణుడు, ఎస్‌ఐ శివప్రసాద్‌ ఇతర సిబ్బంది 
పాల్గొన్నారు. 

Back to Top