వైయ‌స్ ష‌ర్మిల‌కు గుంటూరులో ఘన స్వాగతం

గుంటూరు సిటీలో రాజన్న తనయ రోడ్ షో
 

 గుంటూరు : జిల్లాలో రెండోరోజు వైయ‌స్‌ షర్మిల ప్రచారం కొనసాగుతోంది. రాజన్న తనయకు నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాగా వైయ‌స్‌ షర్మిల శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నందివెలుగు రోడ్డు నుంచి రోడ్‌ షో ప్రారంభించారు.  అక్కడి నుంచి మణి హోటల్‌ సెంటర్, కొల్లి శారద మార్కెట్, బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పొన్నూరు రోడ్డు, లాంచర్ట్‌ రోడ్డు, వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా పూలకొట్ల సెంటర్, హిమనీ కూల్‌డ్రింక్‌ సెంటర్, జిన్నా టవర్, పాతబస్టాండ్‌ సెంటర్‌ మీదుగా బ్రహ్మానందరెడ్డి స్టేడియం సమీపంలోని ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా కార్యాలయం వరకు పర్యటిస్తారు.

అనంతరం ముస్తఫా కార్యాలయం వద్ద వైయ‌స్‌ షర్మిల ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నగరంపాలెంలోని కేకేఆర్‌ ఫంక్షన్‌ ప్లాజా నుంచి తిరిగి రోడ్‌షో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కలెక్టర్‌ కార్యాలయం, కంకరగుంట ఓవర్‌ బ్రిడ్జి, స్వామి థియేటర్‌ సెంటర్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల, కొరిటెపాడు రోడ్డు మీదుగా లాడ్జిసెంటర్‌ మీదుగా అమరావతి రోడ్డులో ప్రవేశిస్తారు. అక్కడ నుంచి గోరంట్ల మీదుగా తాడికొండ చేరుకుంటారు. ఈ రోడ్‌ షోలో షర్మిలతో పాటు పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, చంద్రగిరి ఏసురత్నం పాల్గొన్నారు. 

Back to Top