ఏపీలో దళితులకు రక్షణ లేదు

దళితుల సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
 

దళితుల భూములను బలవంతంగా లాక్కున్నారు
 

దళితుల క్షేమం టీడీపీ దళిత నేతలకు పట్టదా..
 

వైయస్‌ఆర్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్‌

అమరావతి: టీడీపీ పాలనలో దళితులు వివక్షతకు గురవుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు,టీడీపీ దళిత నాయకులు దళిత సమస్యలపై స్పందించడం లేదన్నారు. దళితుల భూములను కూడా ఆక్రమించుకుంటున్నారన్నారు. చంద్రబాబు  అనుచరులు దళితుల భూములను బలవంతంగా లాక్కున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో దళితుల భూములను లాక్కుని  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న భూముల్లో కూడా దళితులకు ఒక ధర,ఇతరులకు ఒక ధర ఇచ్చారన్నారు. దళితవాడల్లో వంద యూనిట్లు ఉచిత కరెంట్‌ అన్నారు. అది ఏమాత్రం అమలు జరగలేదు. కరెంట్‌  చార్జీలు చూస్తుంటే షాక్‌ కొడుతున్నాయన్నారు.

దళితులపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..అని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాక్‌ పోస్టులకు నేటికి ఒక పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఆరు వందల ఎస్సీ వేల్ఫేర్‌ హాస్టళ్లను మూసివేశారు.విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వడంలేదు.మెస్‌ ఛార్జీలు కూడా ఇవ్వకపోవడం వల్లన దళిత విద్యార్థులకు విద్యకు దూరమవుతున్నారన్నారు. దళితులకు సంబంధించి ఇళ్లు కట్టిస్తామన్నారు. ఎన్ని కట్టించారని ప్రశ్నించారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 లక్షల ఇళ్లు కట్టించారని, ఒక ఆంధ్రప్రదేశ్‌కే 25 లక్షల ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలో దళితులకు ఒక ఇల్లు కూడా కట్టలేదన్నారు. రాజధాని నడ్డిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పెడతానన్నారు. 200 కోట్లుతో పెడతానన్న ఆ  విగ్రహం ఎందుకు పెట్టలేదని,  200 కోట్ల రూపాయలు ఏమయ్యాయని  అని ప్రశ్నించారు.

కేవలం ఆ విగ్రహానికి సంబంధించి శంకుస్థాపనకే పరిమితమయ్యారన్నారు. దళిత జాతికి,అంబేద్కర్‌కు జరిగిన అవమానంగా భావిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవిస్తున్న దళిత నాయకులు ఎందుకు ప్రశ్నించడంలేదని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఒక దళిత మహిళను వివస్త్రను చేసి  కొట్టిన పట్టించుకోలేదన్నారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు గతంలో అవమానించేవిధంగా వ్యాఖ్యలు చేశారని, దళితులు చదువుకోరు,శుభ్రంగా ఉండరని టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు.దళితులకు మీ కెందుకురా రాజకీయాలు అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యనించారన్నారుదళితుడైనా టీడీపీ నేత వర్ల రామయ్య దళిత యువకులను అవమానించేవిధంగా మాట్లాడారన్నారు.దళితులకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితుల పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్న  జూపూడి ప్రభాకర్,కారెం శివాజీలు దళితుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు.బయటకు వచ్చి దళితుల హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు.బానిస బతుకులు బతకవద్దని తెలిపారు.

 

Back to Top