సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్ర ద‌ర్యాప్తు మంచిదే

తిరుమ‌ల ల‌డ్డూ వివాదంపై సుప్రీం తీర్పును స్వాగ‌తించిన మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 

సిట్‌ సభ్యులుగా ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి,  FSSAI నుంచి ఒకరు

తాడేప‌ల్లి: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్వాగ‌తించారు. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..  సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది. ఈ అంశంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్పందించారు.

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.  ఈ కేసు విచారణకు సిట్‌ ఒక్కటే సరిపోదు. కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండాలి. సెంట్రల్‌ నుంచి సూపర్‌ విజన్‌ ఉండాల‌ని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై కేసును  సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘ఈ అంశంపై పొలిటికల్‌ డ్రామా జరగొద్దనుకుంటున్నాం. సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు.కల్తీ జరిగిందని మీరు ఊహించుకుంటున్నారా? కల్తీ నెయ్యి కేసు సీబీఐకి ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు’ అని సుప్రీం కోర్టు ప్ర‌శ్నించిన‌ట్లు అంబ‌టి రాంబాబు తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటే మంచిది. సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఇద్దరు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు ఉంటార‌ని చెప్పారు.  ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేప‌డుతార‌ని తెలిపారు.  సిట్‌ సభ్యులుగా ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి,  FSSAI(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ఇండియా) నుంచి ఒకరు దర్యాప్తు చేపట్టనున్నారు.

కాగా  సెప్టెంబరు 30న ఈ కేసును విచారించిన సుప్రీం.. సిట్‌ దర్యాప్తును కొనసాగించాలా లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరిన విషయం తెలిసిందే.  నెయ్యి కల్తీ పై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించారని గత విచారణలో వ్యాఖ్యానించింది.  

కల్తీ అంశంపై వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే .. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు ?.సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా ?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’ అంటూ ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీటీడీ తరుఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నీళ్లు నమిలారు.

Back to Top