సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దంప‌తుల‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి క‌లిశారు. కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్‌ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ  పద్దతుల  నివారణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి కోరారు.

సేవ్ దేశి కౌస్   ప్రచారంలో  భాగంగా  సీఎం వైయ‌స్ జగన్ గారిని దివ్యారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయ‌స్ జగన్ కు ఆమె  గణపతి ప్రతిమను అందజేశారు. అనంతరం దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వివరించారు. 

అనంతరం సీఎం వైయ‌స్ జగన్ సతీమణి వైయ‌స్ భారతమ్మని ఆమె నివాసంలో దివ్యా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  దేశీ జాతి ఆవులను సంరక్షించాల‌నే లక్ష్యంతో  సేవ్ దేశి కౌస్   ప్రచారం చేపట్టామని దీనికి మద్దతు నివ్వాలని భారతమ్మ ని కోరారు..

తెలుగు రాష్ట్ర‌ల్లోని ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కు స్వ‌చ్చ‌మైన ఏ2 మిల్క్ ను అందించాల‌నే ఉద్దేశంతో  పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో ప‌ని చేస్తున్న‌ట్లు ఆమెకు వివరించారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని వైయ‌స్ భారతమ్మ అభినందించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top