వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం సంతోషంగా ఉంది

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు
 

 

తాడేపల్లి: ప్రజలే దైవంగా భావించే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్యాసిపాత్రుడు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసిపాత్రుడు, ఆయన అనుచరులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. అనంతరం సన్యాసిపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఆయన నేతృత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్లు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌లకు సన్యాసినాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషిచేస్తానన్నారు.

Read Also: కనకదుర్గ ఫ్లైఓవర్‌ సత్వరమే పూర్తిచేయాలి

Back to Top