కనకదుర్గ ఫ్లైఓవర్‌ సత్వరమే పూర్తిచేయాలి

రోడ్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టండి

అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేపై సీఎం ఆరా

ఏపీ ఆర్టీసీ చట్టసవరణకు సీఎం వైయస్‌ జగన్‌ అంగీకారం

 

అమరావతి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ పలు విషయాలపై సంబంధిత శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించాలని సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల కోసం రూ.625 కోట్లు మంజూరు చేశారు. అదే విధంగా  అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే కోసం భూసేకరణపై దృష్టిపెట్టి పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేను చిలకలూరిపేట బైపాస్‌కు అనుసంధానం చేసే ప్రతిపాదనకు సీఎం వైయస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. గుండుగొలను – గొల్లపూడి – కలపర్రు – మంగళగిరి బైపాస్‌ పనులపై చర్చించారు. అవసాన దశలో ఉన్న 676 బ్రిడ్జిలను ఎన్డీబీ ప్రాజెక్టులో పెట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఆర్టీసీ చట్ట సవరణకు అంగీకారం తెలిపారు.

Read Also: సన్యాసిపాత్రుడు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

Back to Top