సన్యాసిపాత్రుడు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాడేపల్లి: విశాఖ పట్నం  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో సన్యాసిపాత్రుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సన్యాసిపాత్రుడికి వైయస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సన్యాసిపాత్రుడితో పాటు మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  

Read Also: 'కాపు' కాయని ముద్రగడ 

Back to Top