'కాపు' కాయని ముద్రగడ 

అమాయకుడికి అక్షింతలిస్తే ఆవలకెళ్లి నోట్లో వేసుకున్నాడట. ముద్రగడ పద్మనాభం గారి తీరు అలాగే ఉంది. కాపు ఉద్యమ నేత అని, కాపులకోసం పోరాడుతున్న నాయకుడని నమ్మి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నో సంద్భాల్లో ముద్రగడకు మద్దతిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ చేసిన కాపు ఉద్యమానికి అనుక్షణం వెన్నంటి నిలిచింది. తుని పోరాటంలో ముద్రగడకు మద్దతిచ్చినందుకు నాడుచంద్రబాబు కక్షగట్టి వైయస్సార్సీపీ నేతలపై కేసులుపెట్టి వేధించిన సంగతి ఈ నాయకుడు మర్చిపోయాడేమో కానీ కాపు వర్గీయులు మర్చిపోరు. ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబాన్నీ వేధింపులకు గురి చేసి, గృహనిర్బంధం చేసినప్పుడు కూడా నాడు వారికి మద్దతుగా నిలిచి అధికార పక్షంతో పోరాడింది వైయస్ఆర్ సీపీ. కానీ నేడు అదే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు పెద్దపీట వేస్తూ రాజకీయంగానూ వెన్నుదన్నుగా నిలుస్తున్న తరుణంలో ముద్రగడ చిత్రంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై విమర్శలు చేయడం కాపు నాయకులను, ఆ వర్గం ప్రజలనూ అయోమయంలో పడేస్తోంది. 
కాపులను బీసీల్లో చేరుస్తానన్న అబద్ధపు హామీ ఇచ్చింది చంద్రబాబు అయితే బీసీ.ఎఫ్ రిజర్వేషన్ గురించి వైయస్ జగన్ గారిని ప్రశ్నించడమేంటో ముద్రగడే చెప్పాలి.
కాపు రిజర్వేషన్ అంశం తన పరిధిలోది కాదని, అది కేంద్రం చేతుల్లో ఉందని అధికారంలోకి రాకముందే స్పష్టం  చేసారు వైయస్ జగన్. బదులుగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అబద్ధపు హామీలు కాకుండా సూటిగా కాపుల పట్ల తన వైఖరిని స్పష్టం చేసిన వైయస్ జగన్ కు సన్మానం చేసి మరీ మద్దతు పలికారు ఆ సామాజిక వర్గ ప్రజలు. ఓట్లతో తమ నమ్మకాన్ని కూడా జగన్ పై ఉందని నిరూపించారు. 
వైయస్ జగన్ మోహన్ రెడ్డి 1000 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని ముద్రగడ హర్షించలేక పోయారు. 
కాపు సామాజిక వర్గంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం, నలుగురికి మంత్రి పదవులు, ఇతర కీలక పదవులు ఇస్తూ రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారు.
ఇసుక, మద్యం రవాణా బాధ్యతల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ముద్రగడ చెవిన పడనట్టే నటిస్తున్నారు.
వైయస్ జగన్ గారు స్పష్టంగా తేల్చిన కాపు రిజర్వేషన్ అంశాన్ని మరోసారి తెరపైకి తేవడం వెనుక ముద్రగడ ఉద్దేశ్యం తన ఉనికి కోసం పడే తాపత్రయం అనుకోవాలేమో!!గత ప్రభుత్వం 5000 కోట్లు కాపు కార్పొరేషన్ కు ఇస్తామని చెప్పి 1500 కోట్లు కూడా ఖర్చు చేయకపోయినా ముద్రగడ నోరు మెదపలేదు. టీడీపీ ప్రభుత్వం తమ కుటుంబాన్ని దారుణంగా హింసించిందని చెప్పిన నోటితోనే చంద్రబాబు పై నమ్మకం ఉందన్నారు ముద్రగడ. 
ఈ నేత కాపు సామాజిక వర్గ ఉన్నతి గురించి ఆలోచిస్తున్నారా లేక తన రాజకీయ స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటున్నారా అనేది ఈ లేఖద్వారా స్పష్టంగా తెలిసిపోతోంది. ముద్రగడ తన లేఖలో '' వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి అభద్రతాభావం'' అని అనడం చూస్తే, ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవడంతో తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందేమో అన్న అనవసర భయమే ఆయనలో పేరుకుపోయినట్టు కనిపిస్తోంది. లేఖ ఉద్దేశ్యం ఇసుక, భవన నిర్మాణ కార్మికుల గురించి కాదని కేవలం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రిపై వాఖ్యలు చేసి తన ఉనికిని చాటుకోవడమే అని అర్థం అవుతోంది. 
కాపు నాయకుడిగా ముద్రగడకు ప్రతి సందర్భంలోనూ మద్దతిచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ద్వారా తమ సామాజిక వర్గానికి మరింత మేలు జరిగేలా ప్రయత్నించాలి. అంతేకానీ ముఖ్యమంత్రిగారు తన పరిధికాదని స్పష్టం  చేసిన అదే రిజర్వేషన్ల అంశంపైనే పట్టుబట్టడం ముద్రగడ గారి అమాయకత్వం అనుకోవాలో మూర్ఖంత్వం అనుకోవాలో ఆయన వర్గానికే అంతుబట్టకుండా ఉంది. అత్యధికంగా యువతరం ఉన్న కాపు సామాజిక వర్గానికి ఉన్న ఇతర సమస్యలనో, వారి అవసరాలనో ప్రభుత్వం దృష్టికి తెచ్చే బాధ్యతగ నాయకుడిగా ముద్రగడ పనిచేస్తారో లేక ఇలా చంద్రబాబు గొడుగు నీడనే ఉంటూ ఉండుండి ఉపయోగం లేని లేఖలతో ఉనికిని చాటుకుంటూ గడిపేస్తారో ఆయనే నిర్ణయించుకోవాలి. 

 

Read Also: వరదలు తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుంది

 

Back to Top