ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి

2019 కంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది  

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అదే అహంకారం, అదే లెక్కలేని తనం

కూటమిలో ఉన్నా.. జనసేన, బీజేపీ సీట్లను శాసించిన చంద్రబాబు

ప్రతిపక్షంలో ఉన్న వ్యవస్థల్నీ మేనేజ్‌ చేస్తున్న బాబు

వలంటీర్‌ వ్యవస్థను ఆపేసి.. సంక్షేమం, పెన్షన్లు ఆపించే యత్నం

చంద్రబాబు ఏజెంట్‌గా పురందేశ్వరి

రామోజీ రాతలు.. దత్తపుత్రుడి పాకులాట

అందరి ప్రయత్నమంతా చంద్రబాబు అధికారం కోసమే

షర్మిల పెయిడ్‌ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి  

గుంటూరు :  ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. శ‌నివారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 కూటమి విఫలం కావడంతో బాబు ప్రస్టేషన్‌ పరాకాష్టకు చేరింది:
– చంద్రబాబునాయుడు ఫ్రస్టేషన్‌ బాగా పరాకాష్టకు చేరిందనేది గత వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోంది. 
– తాను కలలు కన్న కూటమి, పొత్తు వికటించడంతో ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. 
– పొత్తు, సీట్ల ఖరారు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ తన కూటమిలో ఉన్న పార్టీలు తన కింద పనిచేసే వాళ్లని చంద్రబాబు భావిస్తున్నారు. 
– ఈయన ఎవరనుకుంటే అభ్యర్థులు ఆయా పార్టీల్లో వాళ్లే అవుతున్నారు. 
– అసలు ఆయా పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జనసేన అనే పార్టీకి ఒక్క పవన్‌ కల్యాణ్‌ తప్ప ఉనికే లేకుండా పోయింది. 
– ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చడం, అప్పటికప్పుడు కండువాలు కప్పడం చూస్తూనే ఉన్నాం. 
– జాతీయ స్థాయి పార్టీలోనూ చంద్రబాబు అనుకున్నట్లే సీట్లు ఖరారు అవుతున్నాయి. 
– ఆ పార్టీలను నమ్ముకుని ఉన్న వారందరికీ నిరాశ, ఆగ్రహాన్ని కలిగించాయి. అవి రచ్చకెక్కడంతో జరుగుతున్న గొడవలు, గందరగోళాలు కన్పిస్తూనే ఉన్నాయి. 
– ఇవన్నీ చివరకు మరో నెలా 8 రోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. 
– 2019 ఎన్నికల కంటే ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలు అవుతోంది. 
– ఏపీ రాజకీయ తెరమీద ఆ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతోంది. 
– ఇవన్నీ స్పష్టంగా కనిపించడంతో చంద్రబాబు గంగవెర్రులెత్తుతున్నారు. శివాలెత్తిపోతున్నారు. 

పిల్ల చేష్టలతో పిచ్చి మాటలు మాట్లాడుతున్న బాబే సైకో:
– ఈ సారి ఆ పూనకం తిట్లకు దిగటం, వ్యవస్థలపై దాడి చేయడం వైపు కూడా వెళ్తోంది. 
– తనకు తాను సర్వాధికారిని అన్నట్లు నేనేం చెప్తే అదే కరెక్ట్‌ అంటున్నాడు. 
– చివరికి పిచ్చి పాటలు పెట్టుకుని ఈయన కూడా డాన్స్‌లు వేస్తున్నాడు. 
– 74 ఏళ్ల వ్యక్తి ఇలానేనా చేసేది? రెండు రాజకీయ పార్టీలు తలపడుతున్నప్పుడు విమర్శలు, ఆరోపణలు ఏమైనా చేసుకోవచ్చు. 
– కానీ రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు సంబంధించిన ఎజెండాపై ఏమైనా మాట్లాడొచ్చు. 
– పిల్ల చేష్టల్లా, పిచ్చివాడిలా పిచ్చి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును సైకో అనాలా? 
– జనం ఏమనుకుంటారో, మొహం మీద ఉమ్మేస్తారనేది కూడా లేకుండా తయారయ్యాడు. 
– తిరుపతిలో మాట్లాడుతూ బీజేపీతో పొత్తులో ఉండి..వరప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా ఓటేయండి అంటున్నాడు. 
– ఈయనే బీజేపీలో అభ్యర్థిగా చంద్రబాబే పెట్టాడు. కానీ మర్చిపోయి బీజేపీకి ఓటేయవద్దంటున్నాడు. 

వ్యవస్థలపై ఒత్తిడి పెట్టడం బాబుకు అలవాటే:
– ఈయన వ్యవస్థలపై ఏ రకంగా వత్తిడి పెడుతున్నాడో ప్రజలంతా గమనించాలి. 
– 2019లో కూడా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు అప్పటి సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిపై ఏ విధంగా చిందులు వేశాడో అందరూ చూశారు. 
– ప్రతిపక్షంలో ఉంటే ఏదో ప్రస్టేషన్లో ఉన్నాడనుకోవచ్చు. గతంలో అధికారంలో ఉండి కూడా ఆయన వ్యవస్థలపై ఇలానే దాడి చేశాడు. 
– జగన్‌ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక వ్యవస్థపై ఇలా మాట్లాడిన సందర్భాలు ఎన్నడూ చూడలేదు. 
– ఈ రోజు వీళ్లు ఎడా పెడా ఫిర్యాదులిస్తుంటే..బదిలీలు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల్లో అవాస్తవాలు ఉన్నా ఆ వ్యవస్థను జగన్‌ గారు మాట్లాడలేదు. 
– ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లిన తర్వాత వారి విచక్షణాధికారాన్ని ప్రశ్నించకూడదనే గౌరవాన్ని ఆయన పాటిస్తున్నారు. 
– ఒక పరిణితి చెందిన ఆలోచనా విధానం ఉన్న వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. 
– చంద్రబాబు అధికారంలో లేకపోవడం వల్ల, ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తుండటం వల్ల ఇలా చేస్తున్నాడంటే అదీ కాదు. 
– ఆయన అధికారంలో ఉండగా కూడా ఇలానే ప్రవర్తించాడు. 
– ఇదీ ఈయనకు వ్యవస్థలపై ఉన్న గౌరవం. ఈయనొచ్చి జగన్‌ గారిని, వైఎస్సార్సీపీని మాట్లాడుతున్నాడు. 
– ప్రజలు ఐదేళ్లలో అన్నీ మర్చిపోయి  ఉంటారనుకుంటున్నాడు. 

వాలంటీర్లను ఆపావు కానీ..పింఛన్లను ఆపగలిగావా?:
– ఈ వారం రోజుల్లో జరిగిన అంశాలు గమనిస్తే..వృద్ధుల పింఛన్ల విషయంలో చంద్రబాబు చేసిన దాష్టీకం అందరూ గమనించారు. 
– పింఛన్లు పంపిణీ ప్రారంభం కావడానికే ముందు చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ అందరూ విషప్రచారం ఎలా చేశారో అందరూ గమనించారు. 
– మేం ముందు నుంచీ భయపడుతున్నట్లే..ఎన్నికల పేరు చెప్పి వారిని దూరం చేశారు. 
– దీనివల్ల ఆయన సాధించింది ఏమీ లేదు. నాలుగేళ్లుగా వాళ్లు ఇస్తూనే ఉన్నారు. వారి ప్రభావం ఉంటే ఆ రోజు నుంచే ఉండేది. 
– వాలంటీర్లను ఆపావు కానీ...పింఛన్లను అయితే నువ్వు ఆపలేవుగా? 
– శక్తి ఉంటే అవి కూడా ఈ సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ లాంటి సంస్థలతో ఆపించేవాడే. ఆ  ధైర్యం చాలలేదు. 
– నిమ్మగడ్డ రమేష్‌ను అనే తన ఏజెంట్‌ రంగంలోకి దింపి ఈ వ్యవస్థపై ఎటాక్‌ చేయించాడు. 
– ఈసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. 
– నిజంగా వాలంటీర్లు వెళ్లి ఇస్తే వేగంగా అవుతుంది. 
– అయినా ఇన్నాళ్లు చంద్రబాబు యాక్సెప్ట్‌ చేయని 1.30 లక్షల మంది సెక్రటేరియట్‌ ఉద్యోగులతో ఇప్పించాలంటాడు. 
– ఏం వారికి వేరే డ్యూటీలు ఉండవా? తమ విధులు చేసుకుంటూ వీలైనంత వేగంగా ఇవ్వాలని వారు ప్రయత్నం చేశారు. 
– రాగలిగిన వారు సచివాలయానికి రండి..లేదంటే మేమే ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పారు. 
– ఇప్పటికి 93 శాతానికి పైగా అయిపోయింది. రెండున్నర రోజుల్లో ఇది జరిగింది. 
– సాధారణంగా వాలంటీర్లు ఉంటే మొదటి రోజే 85 శాతం అయిపోయేది. రెండో రోజు మొత్తం పూర్తి అయ్యేది. 
– ఇంత ఎఫర్ట్‌ పెట్టి, మిగిలిన పనులన్నీ పక్కకు తోసి పూర్తి యంత్రాంగం దానిపై దృష్టి పెట్టి చేశారు. 

డబ్బుల్లేవని ప్రచారం చేసి వృద్ధుల మరణానికి కారణమయ్యాడు:
– అందరూ భయపడ్డట్లే వృద్ధులు ఎండల్లో బయటకు రావడం ఇబ్బంది కలిగించింది. 
– వృద్ధుల్లో వారి ఆతృత వారికి ఉంది. మొదటి తేదీన వచ్చేది ఇంకా రాలేదని వారిలో ఆందోళన పెరిగింది. 
– చంద్రబాబే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ తప్పుడు ప్రచారం చేసి వారిలో ఆందోళన నింపాడు. 
– డబ్బులు లేకుండా రెండు రోజుల్లో ఎలా ఇచ్చారు చంద్రబాబూ? 
– దురదృష్ట వశాత్తు ఎండలకు తాళలేక చనిపోయారు. దానిపై కూడా చంద్రబాబుకు సింపతీ లేదు. 
– దాన్ని కూడా అడ్వాన్టేజ్‌ తీసుకుని మరో లేఖ రాస్తాడు. ఇంత రాక్షస మనస్తత్వం ఏ రాజకీయ నాయకుడికీ ఉండదు. 
– ప్రజల్లో ఉండే వాడైతే, ప్రజలకు సేవ చేయాలనే వాడైతే ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉండదు. 
– వాలంటీర్లు అంతా మీ ఏజెంట్లు అన్నావ్‌..సెక్రటేరియట్‌ ఉద్యోగులే లేరన్నావు. 
– ఈ రోజు వారిని ఎందుకు వాడుకోవు అంటావు..

చంద్రబాబే శాశ్వత ముఖ్యమంత్రి అంటే తప్ప ఎల్లో గ్యాంగ్‌ శాంతించేటట్లు లేదు:
– ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యవస్థలపై ఎటాక్‌ చేస్తున్నాడు. 
– చంద్రబాబునాయుడు అనే వ్యక్తి శాశ్విత ముఖ్యమంత్రిగా ఉండాలని పెడితే తప్ప చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పురందేశ్వరి, లోకేశ్, దత్తపుత్రుడులకు మనసు శాంతించదేమోనని అనిపిస్తోంది. 
– ఈ దండుకు అర్జంటుగా చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టాలి అని తాపత్రయ పడుతున్నారు. 
– దీన్ని టెర్రరిజం అనాలా? ఇంకేమనాలో అర్ధం కావడం లేదు. 
– అలా కాకపోతే వారే మీడియా ట్రైల్స్‌ వేస్తారు. ఈడ్చి పారేసిన ఈసీ అని ఈనాడు రాస్తారు. 
– మరుసటి రోజు వీళ్లా ఎస్పీలు అంటూ రాసుకొస్తాడు. 
– అది కరపత్రం కూడా కాదేమో. ఎందుకంటే టీడీపీ కరపత్రం అందామంటే వారి పార్టీ విధానాలన్నా ప్రకటించుకుంటారు. 
– రామోజీరావుకు మార్గదర్శి కేసు నడుస్తున్నప్పటి నుంచీ ఆయన తట్టుకోలేకపోతున్నాడు. 
– ఈ టెన్షన్‌లోనే ఎక్కడ ఆయన గుండె ఆగిపోతుందో అనిపిస్తోంది.
– ఈ రోజు మళ్లీ సీఎస్‌ గారూ అంటూ రాసుకొచ్చాడు. ముసుగు తొలగించి డైరెక్ట్‌ ఎటాక్‌కు దిగారు. 
– ఆ రోజు ఎన్నికల కమిషన్‌ ఏబీ వెంకటేశ్వరరావును మారిస్తే అతనికి అనుకూలంగా కోర్టులో సీఎస్‌తో అఫడవిట్‌ వేయించారు. 
– అప్పుడు సీఎస్‌ పద్దతి బాగుంది...ఇప్పుడు బాగోలేదంటారు. 
– వ్యవస్థలు ఇండిపెండెంట్‌గా వత్తిడి లేకుండా పనిచేస్తున్నాయి. మేం ఒక్క వ్యవస్థపై ఒత్తిడి తెచ్చినట్లు చూపలేరు. 
– ఈనాడులో తప్పుడు వార్తలు రాయడం, దాన్ని తీసుకెళ్లి ఈసీకి ఇవ్వడం..వాళ్లు మా వాళ్లకు నోటీసులిస్తున్నారు. కేసులు బుక్‌ చేస్తున్నారు. 
– ఏరోజన్నా మా వాళ్లు ఇదేం అన్యాయం అని అడిగారా? 
– మీరెందుకు అలా చేస్తున్నారు? ఎవర్నీ ప్రశాంతంగా పనిచేయనివ్వడం లేదు. 
– లేదంటే ఎల్లో మీడియాలో దర్యాప్తులు, విచారణలు చేసి తీర్పులు కూడా ఇచ్చేశారు. 
– నిన్న చంద్రబాబు లేఖ చూస్తే..ఈ 1.26 లక్షల సచివాలయం సిబ్బందిని వాడుకుని డోర్‌ డెలివరీ చేయకపోవడం వల్ల వృద్ధులు మరణించారని ఆరోపించారు. 
– ఈ మొత్తాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి సీఎస్, ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాశాడు. 
– ఆ లేఖకు ఏమైనా అర్ధం ఉందా? ముందు నీకు అలా అడిగే అర్హత ఉందా? 
– నువ్వే ఈసీపై వత్తిడి తెచ్చి, పింఛన్‌ ఇళ్ల వద్దకు చేరకుండా ఆపావు.
– అక్కడికీ యంత్రాంగం మొత్తం కదిలి 2 రోజుల్లో పూర్తి చేశారు. 
– వృద్ధులు ఎండలకు తాళలేక కొంత మంది చనిపోతే దానికీ ప్రభుత్వమే కారణం అంటూ లేఖలు రాస్తున్నాడు. 
– బయట నువ్వు పింఛన్‌ డోర్‌ డెలివరీ ఆపినందుకు నిన్ను బండ బూతులు తిడుతున్నారు. 
– పొరపాటున ఇతనికి ఓటేస్తే 2014–19 మళ్లీ రిపీట్‌ అవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిసింది. 
– అందుకే ఉలిక్కి పడి ఇదంతా తనమీద పడుతుందని లేఖల మీద లేఖలు రాస్తున్నాడు. 

పురదేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైనా..ఎజెండా చంద్రబాబుదే:
– ఇక ఆయన వదిన పురందేశ్వరి జాతీయ పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఆమె అధ్యక్షురాలుగా ఉన్నా అజెండా మాత్రం చంద్రబాబుదే. 
– ఆమె అహకారం అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసేయాలంటూ లేఖ పెట్టింది. 
– చివరికి ఈసీ ఎవరిని పెట్టాలో కూడా ఈమే సూచించింది. 
– బహుశా చంద్రబాబు ముఖ్యమంత్రి అనుకుని లేఖ రాసిందా? లేదంటే ఈసీ మా పార్టీ తరఫునే పనిచేస్తుందని భావించి రాసిందా? 
– చంద్రబాబు ఒక పక్క, ఆయన వదిన గారు మరో పక్క లేఖలపై లేఖలు రాస్తున్నారు. 
– ఆమె అర్జంటుగా చంద్రబాబును తీసుకొచ్చి కూర్చోబెట్టాలని తాపత్రయపడుతున్నారు. 
– ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దించడం నుంచి కాంగ్రెస్‌ పార్టీలో ఆయన ఏజెంటుగా పురందేశ్వరి పనిచేశారు. 
– ఇప్పుడు బీజేపీలో ఆయన ఏజెంటుగా మాదే రూలింగ్‌ పార్టీ అని డైరెక్షన్స్‌ ఇస్తున్నట్లున్నారు. 
– వీళ్లందరి అహంకారానికి బేస్‌ ఏంటి? శాశ్వితమైన రూలింగ్‌ కోసం మేమున్నాము అనుకుంటున్నారా? 
– ప్రజలందరూ గమనించాల్సిన వాళ్లు బాగుపడటానికి అధికారం కావాలనుకునే ఇలాంటి వారి చేష్టలను గుర్తించాలి. 
– ఆ రోజూ అదే అహంకారం..ఈ రోజూ అదే లెక్కలేనితనం. 
– చంద్రబాబుకు, పురందేశ్వరికి గానీ, రామోజీ బ్యానర్‌ హెడ్డింగులో కానీ, రాధాకృష్ణ వెకిలి రాతల్లో అదే స్పష్టంగా కనిపిస్తోంది. 
– ఇంత అసహ్యంగా, దుర్మార్గంగా, అహంకార పూరితంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రవర్తించిందా? 
– మా నాయకుడు జగన్‌ గారు ఏ రోజైన ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా వారిలా వ్యవహించారా? 
– ఈ తేడాను గమనించాల్సిందిగా మేం ప్రజలందరినీ కోరుతున్నాం. 

చంద్రబాబు ఏది చేసినా ఎన్నికలకు రెండు నెలలు ముందే చేస్తాడు:
– జగన్‌ గారు 2017 ప్లీనరీలో రూ.2వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు. 
– చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానికంటే ముందే చేసి ఉండొచ్చు..లేదా జగన్‌ గారు చెప్పిన వెంటనే అయినా చేసి ఉండొచ్చు. 
– కానీ చంద్రబాబు ఎప్పుడు రూ.2వేలు ఎన్నికలకు ఒక నెల ముందు ఇచ్చాడు. 
– 2014 ఎన్నికల్లో ముగ్గురు ఫోటోలు పెట్టుకుని ఇంటింటికీ చంద్రబాబు ఓ లేఖ రాశాడు. 
– దానిలో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? 
– మూడు సెంట్లు స్థలం అన్నాడు..నిరుద్యోగ భృతి అన్నాడు..ఒక్కటన్నా చేశాడా? 
– ఇక టీడీపీ మేనిఫెస్టో కనిపించకుండానే చేశాడు. 
– చంద్రబాబు, జగన్‌ గారికి తేడా గమనించండి. చంద్రబాబు ఏది చేసినా ఎన్నికలు రెండు నెలలు ముందు చేస్తాడు. 
– జగన్‌ గారు ప్రమాణస్వీకారం చేయగానే ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 
– అలాంటి చంద్రబాబు ఇప్పుడొచ్చి రూ.4వేలు పింఛన్‌ ఇస్తానంటూ మోసపు వాగ్ధానాలతో వస్తున్నాడు. 
– జగన్‌ గారు మళ్లీ ఎన్నికలకు వెళ్లే సరికి తానిచ్చిన హామీలన్నీ పూర్తి చేసి ప్రజల ఆశీస్సులు కోరుతున్నారు. 
– చంద్రబాబు అలవికాని హామీలు ఆకాశం నుంచి తెచ్చిస్తానని చెప్పి అర్జంటుగా అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నాడు. 
– రూ.4వేలు అంటే నమ్మరని, ముందే ఊరించడానికి ఏప్రిల్‌ నుంచే ఇస్తానంటూ చెప్తున్నాడు. 
– సీతమ్మ తల్లిని రావణాసురుడు సాధువు వేషంలో వచ్చినట్లు..చంద్రబాబు కూడా అదే చేయబోతున్నాడు. 
– తన అసలు స్వరూపానికి ముసుగు వేసి సాధువు రూపంలో వెళ్తున్నాడు. 
– ప్రజల వద్దకు వెళ్లి ఇలాంటి అలవికాని హామీలిస్తున్నాడు. 
– మధ్య మధ్యలో జగన్‌ గారిని ఒక రాక్షసుడిగా, ఇది రాక్షస రాజ్యంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు. 
– నేనొస్తే స్వర్గదామం చేసేస్తానని మాయల పకీరులా చెప్పుకొస్తున్నాడు. 
– రెండు రోజులు అయిన తర్వాత రూ.4వేలు చాలవంటే మరో రూ.500 పెంచుతాను అంటాడు. ఇవ్వని దానికి ఎంతైనా చెప్తాడు. 
– ప్రజలకు మేం చేసే విజ్ఞప్తి ఒకటే. మేం దూరం చెప్పడం లేదు. 2014–19లో ఆయనేం చేశాడో, చెప్పినవి అమలు చేశాడో లేదో గమనించండి. 

గత చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక వచ్చిందా?:
– దానితో పాటు ఉచిత ఇసుక అంటున్నాడు. గతంలో చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక వచ్చిందా? 
– క్రేన్లు పెట్టి ఎలా తవ్వేశారో చూశారుగా. వాళ్లకు ఎలా గిట్టుబాటు అవుతుంది? 
– ప్రభుత్వానికి ఆదాయం అంతా వారి జేబుల్లోకి వెళ్లింది. జగన్‌ గారు వచ్చిన తర్వాత ఏటా రూ.800 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతోంది. 
– ఎన్నికల కమిషన్‌కు విచక్షణాధికారం ఉంది. అధికారులపై వారు తీసుకున్న నిర్ణయాన్ని మేం ప్రశ్నించం. 
– చంద్రబాబునాయుడిలా మేం అధికారులపైకి వెళ్లి బెదిరింపులకు దిగం. 
– కానీ అధికారులపై ఫిర్యాదులు వచ్చినవారిలో ఎస్సీలు, మైనార్టీ అధికారులు సిన్సియర్‌గా పనిచేసినవారు ఉన్నారు. 
– పురందేశ్వరి పెట్టిన లేఖ ప్రకారం అయితే రాష్ట్రంలోని అధికారులంతా అమ్ముడుపోయినట్లే. 
– ఇవి టీడీపీ, రామోజీ ఆఫీసు నుంచో తయారవుతున్నాయనుకుంటా. 
– ఏ మార్గదర్శి, ఈనాడు మేనేజర్లనో ఆ పోస్టుల్లో పెడితే వారి మనసు శాంతిస్తుందేమో? 
– లేదంటే చంద్రబాబునే సీఎంగా ఏ పోటీ లేకుండా డిక్లేర్‌ చేస్తే వారు శాంతిస్తారేమో? 
– చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు కదా? 
– ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల కమిషన్‌కు మర్యాద ఇవ్వాలనే కామన్‌సెన్స్‌ మాకుంది. అది టీడీపీకి లేదు. 

ముందు షర్మిల సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి:
– షర్మిల గారు సంజాయిషీ ఇవ్వాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. 
– ఆమె తెలంగాణా నుంచి హఠాత్తుగా ఎందుకు ఇక్కడికి వచ్చారు? తెలంగాణనే జీవితం అన్న ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారు? 
– ఇక్కడ ఎత్తిపోయిన కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలను నీకు ఎవరు అప్పగించారు? 
– అదే కాంగ్రెస్‌ను విపరీతంగా తెలంగాణలో తిట్టి ఇప్పుడు ఎలా కలిశారు? 
– తెలంగాణ ప్రయోజనాలే నాకు ముఖ్యం, అవసరమైతే ఏపీతో కొట్లాడతా అని కూడా అన్నారు. 
– అదంతా ఏమైంది..ఒక పెయిడ్‌ ఆర్టిస్టులా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? 
– ముందు వీటికి సమాధానాలు చెప్తే..వివేకా హత్య, ఆమె తీసుకున్న పాత్రకు జవాబు కూడా దానిలోనే ఉంటుంది. 
– నాలుగేళ్లుగా పట్టని వివేకా హత్య ఈ రోజు హఠాత్తుగా ఎందుకు పట్టింది? 
– వివేకా హత్య విషయాన్ని ప్రజాకోర్టులోనే తేల్చుకుంటాం అన్నట్లున్నారు. 
– మరీ మంచిది..అప్పటికైనా వారి నోరు మూత పడుతుందా? ఎన్నికల్లో ఎవరేంటో తెలుస్తుందిగా. 
– ఏ ప్రాతిపదిక లేని, అసంబద్ధమైన ఆరోపణలకు సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఎక్కడికి పోతుందో కూడా తెలియదు. 
– కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై వీరే ఒక నిర్ణయానికి వచ్చి, ఏమీ తేలకముందే హంతకుడు అని ముద్ర వేస్తున్నారు. 
– చంద్రబాబులా ఒక అహంకారంతో కూడా మాటలు మాట్లాడుతుంటే ఎలా? 
– ఆమెదంతా వ్యక్తిగతమైన అజెండా. ఆ ఎజెండా కూడా చంద్రబాబు ఎజెండాను భుజానకెత్తుకుంది. అందుకే పెయిడ్‌ ఆర్టిస్తు అనాల్సి వస్తోంది. 

Back to Top