జర్నలిస్ట్‌ గోపి మృతికి సజ్జల సంతాపం

తాడేప‌ల్లి: సాక్షి టీవీ సినిమా జర్నలిస్ట్, ఆర్టిస్ట్‌ తిక్కలగట్టు గోపి ( గరం గరం గోపి) హఠాన్మరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వృత్తిపట్ల అంకిత భావంతో ఉన్న వ్యక్తి గోపి అని సజ్జల కొనియాడారు. తాజాగా సాక్షి టీవీలో ప్ర‌సార‌మ‌య్యే (గ‌రం గ‌రం వార్త‌లు) గరంగరం గోపి పాత్రద్వారా సమకాలీన అంశాలను సామాన్యునికి చేరవేయడంలో గోపి ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. గోపి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం తెల్లవారుజామున గోపి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత వారం రోజులుగా గోపి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

తాజా వీడియోలు

Back to Top