కూటమి నేతలు  పాప పరిహారం చేసుకోవాలి  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

హైదరాబాద్‌:  తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు  పాప పరిహారం చేసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఈ విష‌యంలో వైయ‌స్ జగన్ హుందాగా వ్యవహరించార‌ని చెప్పారు. 
శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిదంటూ చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. బాబు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే టీడీపీ ఆఫీసులో ఎన్‌డీడీబీ రిపోర్టును లీక్‌ చేశారని మండిపడ్డారు. ఏమీ జరగకుండానే ఏదో జరిగినట్లు ఘోరమైన ఆరోపణలు చేశారని విమర్శించారు.

అయితే ప్రభుత్వ ఆరోపణలను టీటీడీ మాజీ చైర్మన్లు ఖండించారని, దేనికైనా సిద్దమని చెప్పారని తెలిపారు. అంతేగాక లడ్డూ వివాదంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారని. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని  తెలిపారు. సోమవారం ఈ కేసు విచారణకు కూడా రానుందని తెలిపారు. 

తిరుమల లడ్డూ విషయంలో చంద్ర బాబు ఘోరమైన అబద్ధం ఆడారు. బాబు అన్నట్టుగా జంతువుల కొవ్వు మాట షోకాజ్ నోటీసులో లేవు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ, బుడమేరు బాధితుల అంశాలు పక్కన పెట్టి.. ఇప్పుడు టీడీడీ లడ్డూను తెరపైకి తీసుకువచ్చారు . చలో తిరుపతి అని వైయస్ జగన్ ఏమైనా పిలుపు ఇచ్చారా? ఇష్యూ చేసింది టీడీపీ, ఉద్రిక్తత సృషించారు

‘వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల  పర్యటనకు అనుమతి లేదని మా నేతలకు ఇచ్చిన నోటీసులలో ఉంది. 
డిక్లరేషన్ అంశం భక్తుడు, టీటీడీకి సంబంధించిన అంశం. తిరుమల లడ్డూ వ్యవహారంలో కూటమి నేతలు  పాప పరిహారం చేసుకోవాలి. వైయ‌స్ జగన్ హుందాగా వ్యవహరించారు. 

మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా? ఇప్పటికే పలు మార్లు వైయ‌స్ జగన్ తిరుమలకు వెళ్లి వచ్చారు. ఎప్పుడు లేని డిక్లరేషన్ అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది?  వైయ‌స్ జగన్ తిరుమలకు వెళతా అంటే కట్టలు కట్టుకుని వచ్చి రాజకీయం చేశార‌ని మండిపడ్డారు.

Back to Top