పవన్‌ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

2014-19 మధ్య చంద్రబాబు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు

మా పార్టీలో చిన్న చిన్న అసంతృప్తులు అన్నీ సర్దుకుంటాయి

 తాడేపల్లి: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేదని, పవన్‌ని నమ్ముకుని మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గం ఓట్లు పడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్థితిలోకి చంద్రబాబు వెళ్లారని ఎద్దేవా చేశారు. 

        చంద్రబాబు రాజకీయచరిత్రలో ఏ ఎన్నికల్లో కూడా తన సొంతబలం మీద పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవని, రానున్న ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఓట్లుపడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్దితిలోకి చంద్రబాబు వెళ్ళారని  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు పక్కన లేడు అని ఈరోజు చెబితే ఒక్క అభ్యర్ది కూడా తూపాకి గుండుకు కూడా దొరకడని అన్నారు. తనను కలిసిన మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ను మాత్రమే నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికలలో పవన్ కల్యాణ్ కలసి రాకపోతే చంద్రబాబుకు పోటీ చేసే ధైర్యం లేదని అసలు టిడిపికి 175 నియోజకవర్గాలలో అభ్యర్దులు ఉన్నారో లేదో తెలియని పరిస్దితి నెలకొని ఉందన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్త ఒక్కరు కూడా పట్టించుకోలేకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా  పవన్‌ సహకారంతో  ఎలాగైనా అధికారంలోకి  రావాలని బాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. పచ్చమీడియాలో అవాస్తవాలతో కూడిన రాతలు చూసి చంద్రబాబు భ్రమలలో బతుకుతున్నారని తెలియచేశారు.నిజానికి  2014-19 మధ్య చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ధ్వంసం చేశారని అందుకే 2019లో ప్రజలు చంద్రబాబును ధ్వంసం చేశారన్నారు. శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ అభివృధ్ది చేస్తున్నారని వివరించారు.

         ముఖ్యంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా  వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రజల ఎకానమీ ఏమాత్రం దెబ్బతినలేదన్నారు.కోవిడ్ ను ఎదుర్కొవడంలో దేశంలోనే ఆదర్శవంతమైన విధానాన్ని జగన్ అనుసరించారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం కోవిడ్‌ వంటి సంక్షోభం నుంచి బయటపడిందన్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ సీఎం శ్రీ వైయస్ జగన్‌ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడింది, వారి కొనుగోలు శక్తి పెరిగింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో  ఏపీ దేశంలోనే  నెంబర్‌ 1 ర్యాంకులో ఉంది. చంద్రబాబు హయాంలో  రాష్ట్రం ధ్వంసమైందని ప్రజలు నమ్మి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 151 సీట్లతో అఖండ విజయం కట్టబెట్టారని వివరించారు.

       పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ శ్రీ వైయస్  జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ అధినేత మాట కాదనే వారు ఎవరూ ఉండరు. అభ్యర్దుల ఎంపికకు సంబంధించి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికి అన్నీ సర్దుకుంటాయని అన్నారు. మఖ్యంగా వైఎస్సార్ సిపి  నాయకులు పదవులను బాధ్యతగానే భావిస్తారన్నారు. ఎల్లో మీడియా టీడీపీ గురించి రాయటానికి ఏమీలేక వైయస్సార్ సిపి అంతర్గత విషయాల గురించి అదే పనిగా రాస్తోందన్నారు. తన పరిపాలన గురించి గొప్పలు చెప్పుకోవడం బాబుకు అలవాటేనని అన్నారు.

 వైఎస్‌ జగన్‌ వైయ‌స్ఆర్‌సీపీని కొన్ని విలువలతో నడిపిస్తున్నారు. మా పార్టీలో ప్రతి నాయకుడు పదవిని బాధ్యతగానే భావిస్తారు, అధికారంగా ఎప్పుడూ భావించరు. నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చినంత మాత్రాన ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జిల విలువను తగ్గించడంలా భావించకూడదని  స్పష్టం చేశారు. వైయస్సార్ సిపికి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు.ఇంకా మెరుగైన ఫలితాల కోసమే కొన్నిచోట్ల అభ్యర్దులను మార్చడం జరుగుతుందన్నారు. ఇంఛార్జ్ లుగా తప్పించినసందర్బంలో భాధ,ఆవేదన వస్తాయి.అందులో సందేహం లేదు.వారిని కూర్చోపెట్టి మాట్లాడతాం.మాకు వ్యవస్దాగతమైన శక్తిసామర్ద్యాలు ఉన్నాయి.టిడిపి అనేది స్వార్దప్రయోజనాలే పరమావధిగా నడుపుతున్న పార్టీ.మా అభ్యర్దులను మార్చడం అనేది మా చేతకానితనమో,వైఫల్యం అయితే వారికి అఢ్వాంటేజే కదా సంతోషించమనండి.లేదా సంబరాలు చేసుకోమనండి. ఎందుకంటే వాస్తవంలో వైయస్సార్ సిపి రాష్ర్టంలో ప్రతి నియోజకవర్గంలో చాలాశక్తివంతంగా ఉంది. ప్రజలలో మమేకమైన పార్టీగా జగన్ గారు తీర్చిదిద్దారు.గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల ఆలోచనలు తెలుసుకుని వారి అవసరాలు తీర్చాం. మేం వారికి చేసిన మేలు స్వయంగా కలసి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో జగన్ గారు పలుమార్లు చెప్పారు.175 స్దానాలను గెలుచుకోవాలనే లక్ష్యంలో భాగంగా సామాజిక సమీకరణలలో అభ్యర్దులను మార్చాల్సివస్తే మీ సేవలు మరోచోట వినియోగించుకుంటామని స్పష్టంగా చెప్పారు.సర్వేలలో వస్తున్న సమాచారం ఆధారంగా శాస్ర్తీయంగా మార్పులు చేయడం జరుగుతుంది. టిడిపి,జనసేనలు మాపై పొద్దుపోని ఆరోపణలు చేస్తున్నాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ సిధ్దంగా ఉందని తెలియచేశారు.అయితే మాకు ప్రజలు ఇచ్చిన మేండెట్ ప్రకారం ఏప్రిల్ వరకు కొనసాగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇంకా వాటిని కూడా నెరవేర్చవచ్చనేది మా ఉధ్యేశ్యం.

     టిడిపి 100 స్దానాలలో పోటీ చేస్తుందా...లేదా 90 టిడిపి తీసుకుని 85 పవన్ కల్యాణ్ కు ఇస్తారా.... జనసేన 100 స్దానాలలో పోటీ చేసి టిడిపి మిగిలిన వాటిలో పోటీ చేస్తుందా.....ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరు....ఈ ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి.ఎందుకంటే వారికి ఏ విషయంలో స్పష్టత లేదు.అసలు 175 స్దానాలలో వారికి అభ్యర్దులు ఉన్నారా అనేది అనుమానమే అని విమర్శించారు.జనసేన-టిడిపి సమన్వయకమిటి సమావేశాలు ఏమయ్యాయి.రెండు మీటింగ్ లు జరగగానే వారు కొట్టుకున్నారు.

     చంద్రబాబు కోసం మృతి చెందారంటున్నవారికి ఎంతమందికి పరిహారం ఇచ్చారు. ఇచ్చిన చెక్కులు చెల్లినాయా....లోకేష్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర అనేది నడిచాడా లేదనేది నాకు అనుమానమే.టిడిపి ఏ యాక్టివిటి ఎందుకు చేస్తున్నారో ఏమైనా అర్ధం ఉందా.చంద్రబాబును జైలులో వేసినప్పుడు ఎక్కడాలేని రోగాలన్నీ చంద్రబాబుకే ఉన్నాయని వాదించారు. ఇప్పుడేమో రొమ్ము విరుచుకుని లోకమంతా తిరుగుతానని అంటున్నాడు. ఎక్కడనుించి వచ్చింది ఈ శక్తి అంతా ఆయనే చెప్పాలి. జైలులో ఉన్నప్పుడు ఆయన భార్య,కోడలు తిరుగుతారని అన్నారు. ఇప్పుడు వాళ్లేమయ్యారు.ఆరోజు తిరగాల్సిన కొడుకు ఇన్నాళ్ళు ఎక్కడ పడుకున్నాడు. ఈనాడు మూడ్రోజులలో ఎలా పాదయాత్ర ముగిస్తున్నాడు. తెలంగాణాలో వాళ్ళు ఏం చేశారు. కాంగ్రెస్ టిడిపిని గెలిపించిందని ఊదరగొడుతున్నారు. సెట్లర్ల ఓట్లు ఎక్కువున్న చోట్ల కాంగ్రెస్ ఒోడిపోయింది. టిడిపి, కాంగ్రెస్ తో ఉన్నామని చెప్పినందువల్ల మిగిలినవాళ్లంతా ఏకమైనారనే  ఒరకమైన ప్రచారం హైద్రాబాద్ రిజల్ట్స్ చూస్తే అర్ధమవుతుంది. పవన్ కల్యాణ్ పోటీచేసిన చోట్ల టిడిపి ఓట్లు ఎందుకు వేయించలేకపోయారు అని ప్రశ్నించారు.ఇలా చాలా ప్రశ్నలు వస్తుంటాయి.మీడియావారే వారిని అడగాలి. వాళ్ల పార్టీల సంగతి చూసుకోకుండా మా పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడుతుంటారు.

    175 స్దానాలలో పోటీ చేస్తామని ఐనా చంద్రబాబు ముందుకు రావాలి..... లేదా పవన్ కల్యాణ్,సిపిఐ,సిపిఎంలతో పొత్తు పెట్టుకున్నా.... బిజేపితో పొత్తుపెట్టుకున్నా....ఆయనిష్టం... ఇంకా ఏ నుంచి  జడ్ వరకు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ఆయనిష్టం. వారి అభ్యర్దులు వాటి గురించి ఆయన తేల్చుకోవాలి. ఆ పనులలో బిజీగా ఉంటే ఎన్నికలకు సంబంధించి సీరియస్ నెస్ వస్తుంది. అలా కాకుండా మేం ఏంచేస్తున్నామో.... తొంగిచూసి లేనిపోనివన్నీ మాట్లాడుతుంటే ప్రజలు 2019 లాగానే టిడిపి పట్ల రియాక్ట్ అవుతారు.లేదా ఈసారి అదీ కూడా లేకుండా సున్నా ఫలితాలు ఇస్తారనేలా వారి వ్యవహారం ఉందని  అన్నారు. ఎస్సీలు,బిసిల స్దానాలకు సంబంధించి ఈనాడు తలకాయలేని రాతలు రాస్తుందని మండిపడ్డారు. వారి హెడ్డింగ్ లు చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్దం కావడంలేదు.

      తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మధ్దతు ఇచ్చారు.ఇప్పుడు ఏపి ఎన్నికలలో షర్మిల ఇక్కడకు కాంగ్రెస్ తరపున వస్తారు అని కాంగ్రెస్ నేతలంటున్నారనే మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ ఏ రాజకీయపార్టీ ఐనా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది.ఎవరు ఉన్నా అందరూ కలసి వచ్చిన ఫేస్ చేయగలం...ఫేస్ చేసి అందరికంటే మిన్నగా ఢంపింగ్ మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందగలం అన్నారు. మా టీం చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంది.. పబ్లిక్ గా మనకు తెలిసింది ఏమంటే షర్మిల తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టారు. తెలంగాణాలో యాక్టివిటి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే నిజమని అనుకుంటున్నాం. కాంగ్రెస్ నేతల ఊహాగానాలు కావచ్చు.వారికి ఏదైనా సమాచారంతో మాట్లాడి ఉండవచ్చు అని అనుకుంటున్నాను.

తాజా వీడియోలు

Back to Top