ఉద్యోగులను చర్చలకు రావాలని కోరుతున్నాం

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురు చూశాం

రేపటి నుంచి కూడా చర్చలకు అందుబాటులో ఉంటాం

ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం

అమరావతి: ఉద్యోగులను చర్చలకు రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉద్యోగ సంఘాల నాయకుల కోసం ఎదురుచూశామన్నారు. వ్యక్తిగతంగా కూడా మాట్లాడి రమ్మని పిలిచామన్నారు. ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుందన్నారు. టీవీల ద్వారా పరిష్కారం జరదన్నారు. సమ్మె చట్ట విరుద్దం అని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చర్చలకు రేపటి నుంచి కూడా అందుబాటులో ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఈ సమస్య ఎప్పటికైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని చెప్పారు. బాధ్యత కలిగిన ఉద్యోగ సంఘాలు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి మొండివైఖరి సమంజసం కాదని హితవు పలికారు. వాళ్లు శత్రువులు కాదు..మా ఉద్యోగులే అని పేర్కొన్నారు. పే స్లిప్పులు రాకుండా నష్టమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఉద్యోగులకు నష్టం రాకుండా చూసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. 
 

Back to Top