మోసం చేయడo, ప్రజలలో భ్రమలు కల్పించడం చంద్రబాబు వీడలేదు.

రాష్ర్టాన్ని దివాళా తీయించి, అప్పులపాలు చేసింది చంద్రబాబే.

పేదలను అభివృధ్ది పధంలోకి తీసుకెళ్ళేందుకు శ్రీ వైయస్ జగన్ ధృడసంకల్పంతో ఉన్నారు.

ప్రతి పేద విద్యార్ధి ఉన్నత చదువులు చదివేలా శ్రీ వైయస్ జగన్ ప్రణాళిక సిధ్దం చేశారు.

ముస్లిం సంచార జాతుల ఆత్మీయసమావేశంలో వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

తాడేపల్లి....ప్రతి పేద విద్యార్ధి ప్రాధమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు చదువుకునేల ప్రణాళికను రూపకల్పన చేసిన ఘనత శ్రీ వైయస్ జగన్ దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్ధి ఇంగ్లీషు నేర్చుకోవడంతో పాటు ప్రపంచంలోని ఏ విధ్యార్దితో అయినా పోటీపడగలిగేలా తీర్చిదిద్దాలనే దిశగా శ్రీ వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారని తెలియచేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం సంచార జాతుల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి ముస్లిం సంచార జాతుల కార్పోరేషన్ ఛైర్ పర్సన్  సయ్యద్ ఆసిఫా అధ్యక్షత వహించారు.

సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్యం ఖరీదైపోయి పేద, మధ్యతరగతి వర్గాలు ఆర్ధికంగా చితికిపోతున్న విషయం గమనించి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీలను ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మరో రెండడగులు ముందుకు వేసి విద్య,వైద్యం ను శాశ్వతంగా పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచారన్నారు. అదే విధంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉండేలా చేయడంతోపాటు వెనకబడిన ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో కూడా వాటిని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇవన్నీ పూర్తయితే పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం 35 లక్షల మందికి పింఛన్ లు అందిస్తే నేడు శ్రీ వైయస్ జగన్ 60 లక్షల మందికి పింఛన్ లు అందిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో పింఛన్ లకు నెలకు 500 కోట్ల రూపాయలు కేటాయించేవారని, నేడు పింఛన్ ల బడ్జెట్ 1400 కోట్ల రూపాయలని తెలియచేశారు. చంద్రబాబు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల తెచ్చి రాష్ర్టాన్ని దివాలా తీయించారన్నారు. నేడు శ్రీ వైయస్ జగన్ దాదాపు లక్షకోట్ల మేర వివిధ పథ‌కాల కింద ప్రత్యక్షంగా ప్రజల ఖాతాలలోకి వేయడం జరిగిందన్నారు. చంద్రబాబు హయాంలో దోపిడీ సాగితే నేడు అంతా పారదర్శకంగా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు శ్రీ వైయస్ జగన్ పాలన అందిస్తున్నారని వివరించారు. ముస్లిం సంచార జాతులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వ పథ‌కాల గురించి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న విష, దుష్ప్రచారం తిప్పికొట్టాలని కోరారు. నిత్యం ప్రజలతో మమేకం అవ్వడమే శ్రీ వైయస్ జగన్ కు ఇష్టం అయిన అంశం అని అన్నారు. చంద్రబాబులా భ్రమలు కల్పించడం, అధికారం కోసం మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేయడం శ్రీ వైయస్ జగన్ కు తెలియవని అన్నారు. ప్రజలకు మేలు కలుగుతుందనుకుంటే ఎంత కష్టమైన పని అయినా శ్రీ వైయస్ జగన్ చేసి తీరతారని అన్నారు. చంద్రబాబు విష, దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజల సమస్యలను తీరుస్తూ వారితో ఉండగలగడమే కార్యకర్తలు చేయాల్సిన పని అన్నారు.

శాసనమండలి సభ్యులు  లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ కుల సమావేశాలనేవి సహజంగా ఎన్నికల సమయంలోనే లేదా ఆరు నెలల ముందో వాటిని నిర్వహించి తమకు మీ కులం ఓట్లన్ని వేయాలని కోరుతుంటారు. ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికలతోపాటు దాదాపు అన్ని రకాల ఎన్నికలు అయిపోయాయి. ఓట్లతో ఇప్పుడు సంబంధం లేదు. అయినా కూడా కులాలకు సంబంధించి సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే బిసి కులాల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం, వారిలో నాయకత్వాన్ని పెంపొందించేవిధంగా చర్యలు తీసుకోవడం, శ్రీ వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథ‌కాలు ఆయా కులాల్లో అన్ని కుటుంబాలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ముస్లిం సంచార జాతులు చాలా పేదరికంలో ఉన్నారు. వారందరిని సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లాలనే ధృడసంకల్పంతో శ్రీ వైయస్ జగన్ గారు ఉన్నారన్నారు. బిసిలను అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్తున్న శ్రీ వైయస్ జగన్ గారికి అందరూ అండగా నిలబడాలన్నారు. ముస్లింసంచార జాతులకు సంబంధించి అందరూ నాయకులుగా ఎదగాలని కోరారు.

సమావేశంలో శాసనసభ్యుడు  మహ్మద్ ముస్తఫా, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-చైర్మన్అం కంరెడ్డి నారాయ‌ణ‌ మూర్తి  , రాష్ట్ర హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్  బ‌ద్వేలు షేక్‌ గౌస్ లాజాం , బీసీ విభాగ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త  తొండమల్ల పుల్లయ్య , అత్యంత వెన‌క‌బ‌డిన జాతులు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ వీర‌న్న‌ , ముస్లిం సంచార జాతుల కార్పోరేషన్ డైరక్టర్లు, ముస్లిం సంచార జాతుల కులసంఘ రాష్ర్ట నేతలు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top