బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ

ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఫైర్ 
 

వైయ‌స్ఆర్ జిల్లా : ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఒక పథకం అందించలేకపోయిందని కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన. 

ఎన్నికలప్పుడు బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు. కానీ, ఏడాది తిరిగేలోపే.. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ అనిపించుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలోని ఐదేళ్లలోని ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే లక్షా 55,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఇంత అప్పు చేసినా ప్రజలకు ఒక పథకం అందిచలేకపోయింది.  

.. మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500, రైతన్నలకు ఏడాదికి 20000, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్‌కి 50 సీట్లు వస్తే వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుది. పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తి అయితే.. మిగిలిన పది శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేదు’’ అని అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. కూటమి వైఫల్యాలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ర్యాలీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top