ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఫైర్‌

 తిరుపతి: కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని వైయ‌స్ఆర్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్డీవోకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. 

వంచన, మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు. 143 హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై ఇప్పటిదాకా 2,466 కేసులు పెట్టారు. ఆరోగ్యశ్రీని నాశనం చేశారు. ప్రజలకు జరిగిన అన్యాయం పై పేద ప్రజలు పక్షనా పోరాటాలు కొనసాగిస్తాం.. 

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పూరించిన సమరశంఖంలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం అయ్యింది అని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Back to Top