

















శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
విజయనగరం: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వెన్నపోటు దినంలో పాల్గొన్న బొత్స.. ప్రసంగిస్తుండగానే సొమ్ముసిల్లి పడిపోయారు. వెంటనే తిరిగి కోలుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీలో వెన్నుపోటు దినం విజయవంతం అయ్యిందన్నారు. సభను విజయవంతం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రసంగిస్తుండగా.. స్వల్ప అస్వస్థతకు గురయ్యానని.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆయన తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని.. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో కోలుకున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు.