విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైయస్ఆర్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలికారు. బస్సు యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 26 వ వార్డులోని ఎన్ జీజీఓస్ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన జీవీఎంసీ స్కూల్ ను వైయస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగ నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైయస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కే కే రాజు హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం కోసం దేశంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం వైయస్ జగన్ ఒక్కరే - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు - నేడు ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నారని, అవ్వా , తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ముత్యాల నాయుుడు పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గ నేతలు రాష్ట్రంలో ఏ స్థానం నుంచైనా పోటీ చేయ గల సత్తా జగన్ కల్పించారు. చంద్రగిరిలో పుట్టి చంద్రబాబు కుప్పంలో, హైదరాబాద్ లో పుట్టి మంగళగిరిలో లోకేశ్ ఎలా పోటీ చేస్తున్నారు - మంత్రి మేరుగ నాగార్జున ధ్వజం మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. అధికారం పెద్దలకు కాదు.. పేదలదని, పాలకులు.. సేవకులని సీఎంగా జగన్ నిరూపించారు - ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలని సంకల్పించారని, రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 133 కులాలు ఉంటే వాటిని క్రోడీకరించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. వెనుకబడివ వర్గాలకు సమాజంలో గౌరవం కల్పించాలని జగన్ పరితపించారన్నారు. అధికారం పెద్దలది కాదని, పేదలదని జగన్ నిరూపించారని, జగన్ పాలనలో పాలకులు ప్రజలకు సేవకులు మాత్రమేనని వివరించారు. *సాధారణ గృహిణినైన నన్ను గ్రేటర్ విశాఖ మేయర్ ను చేయడమే జగన్ సాధించిన సాధికారతకు నిదర్శనం - గ్రేటర్ విశాఖ మేయర్ హరికుమారి* గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనలుు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంఖుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ, దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలుగన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు. వైయస్ఆర్ సీపీ మైనార్టీ నాయకుడు ఎస్ ఏ రెహ్మన్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేసినపుడు లోకేశ్ ను మంత్రిని చేసుకున్నాడని, ఎస్టీలు, ముస్లింలు కనపించ లేదని మండిపడ్డారు.